• search

భారత్ ఆందోళనను పట్టించుకోని చైనా, కీలక నిర్ణయం: మరింత దూరం

By Srinivas G
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బీజింగ్: వన్ బెల్డ్ వన్ రోడ్డు (ఓబీఓఆర్)ను చైనా రాజ్యాంగంలో చేర్చారు. దీంతో భారత్ - చైనా మధ్య సంబంధాలు మరింత ఆందోళన పరిస్థితికి దారి తీయవచ్చునని అంటున్నారు.

   Today TOP 10 Trending News ఈరోజు టాప్ 10 న్యూస్ | Oneindia Telugu

   చదవండి: మమ్మల్ని ఎదుర్కొనేందుకే: భారత్-అమెరికా సంబంధాలపై చైనా అక్కసు, హెచ్చరిక

   చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఓబీఓఆర్ పైన ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ అంతర్జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును చైనా కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగంలో చేర్చారు.

   చదవండి: శ్రీలంక నుంచి వ్యూహం, డ్రాగన్‌కు చెక్: చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్

   చైనాకు ఇది మహత్తర వ్యూహమని

   చైనాకు ఇది మహత్తర వ్యూహమని

   మంగళవారం జరిగిన సమావేశంలో దీనికి సంబంధించిన సవరణను పార్టీ ఆమోదించింది. దీని ప్రాధాన్యతను చైనా వ్యూహ నిపుణుడు వాంగ్ దెహువా వివరించారు. జీ జిన్‌పింగ్ దార్శనికతలో ఇది చాలా ముఖ్యమైనదన్నారు. చైనాకు ఇది మహత్తరమైన వ్యూహమన్నారు. ఉమ్మడి గమ్యస్థానంగల అంతర్జాతీయ సమాజాన్ని ఏర్పాటు చేయడమే ప్రధాన ఆలోచన అన్నారు.

   భారత్ అర్థం చేసుకుంటుందంటూ

   భారత్ అర్థం చేసుకుంటుందంటూ

   భారతదేశం కూడా దీనిని అర్థం చేసుకుంటుందనే ఉద్దేశంతో సహనంతో వేచి చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, మేలో జరిగిన ఓబీఓఆర్ సమావేశానికి భారత్ హాజరుకాలేదు. ఈ ప్రాజెక్టుపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరు గుండా ఈ ప్రాజెక్టును నిర్మించాలని చైనా వ్యూహం పన్నింది. దీనికి చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ అని పేరు పెట్టింది.

   భారత్ ఆరోపణలు

   భారత్ ఆరోపణలు

   ఈ ప్రాజెక్టును అంగీకరించిన దేశాలను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయడానికి చైనా ప్రయత్నిస్తోందని భారత్ ఆరోపించింది. అదేవిధంగా ఓబీఓఆర్ ప్రాజెక్టులో పారదర్శకత లేదని పేర్కొంది.

   భారత్ ఆందోళన పట్టించుకోలేదు

   భారత్ ఆందోళన పట్టించుకోలేదు

   భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనను పరిష్కరించేందుకు చైనా ఎటువంట చర్యలు తీసుకోలేదు. దీంతో తాజా పరిణామాలు ఇరు దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

   భారత్ - చైనా సరిహద్దుల్లోని జవాన్లకు మాండరీస్ భాష

   భారత్ - చైనా సరిహద్దుల్లోని జవాన్లకు మాండరీస్ భాష

   ఇదిలా ఉండగా, భారత్ - చైనా సరిహద్దుల్లో పనిచేస్తున్న ఐటీబీపీ జవాన్లు, అధికారులు త్వరలోనే చైనీస్‌ భాష మాండరీన్‌ నేర్చుకోనున్నారు. వారి కోసం ప్రత్యేకంగా బేసిక్‌ మాండరీన్‌ తరగతులు కూడా నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. మాండరీన్‌ నేర్చుకోవడం చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సైనికులతో చర్చలకు ఉపయోగపడుతుందన్నారు. భాషా పరమైన సమస్యలు తలెత్తవన్నారు.

   ముస్సోరిలో ఇప్పటికే చైనీస్ లాంగ్వేజ్ సెల్

   ముస్సోరిలో ఇప్పటికే చైనీస్ లాంగ్వేజ్ సెల్

   ఇప్పటికే ముస్సోరీలోని ఐటీబీపీ అకాడమీలో చైనీస్‌ లాంగ్వేజ్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. 150 మంది సైనికులు ఇప్పటికే ఈ భాషను నేర్చుకుంటుండగా, ప్రతి ఐటీబీపీ జవాన్‌ తప్పనిసరిగా నేర్చుకోవాలని రాజ్‌నాథ్‌ సూచించారు.

   English summary
   In a reflection of how China's leader Xi Jinping is personally pushing his pet One Belt, One Road (OBOR) global infrastructure initiative, the Communist Party of China (CPC) congress today passed an amendment to the party constitution to specifically mention the plan.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more