వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ కు షాక్! కిమ్ మా మాట వినాలంటే.. మీ సైనికులు వెనక్కి వెళ్లాలి, చైనా కండీషన్

అమెరికా నిజంగా శాంతిని కోరుకునే దేశమే అయితే, వెంటనే తన సైనికులను ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల నుంచి ఉపసంహరించాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఇరకాటంలో పడేసింది చైనా.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాకు.. చైనా షాకిచ్చింది. ఉత్తరకొరియా తమ మాట వినాలంటే.. ఆ ద్వీప సరిహద్దుల నుంచి అమెరికా దళాలను ఊపసంహరించాలంటూ తాజాగా అమెరికాకు ఓ కండీషన్ పెట్టింది.

చైనా 'భస్మాసుర హస్తమే'! అప్పులిచ్చి.. దేశాలకు చుక్కలు చూపిస్తోన్న డ్రాగన్!చైనా 'భస్మాసుర హస్తమే'! అప్పులిచ్చి.. దేశాలకు చుక్కలు చూపిస్తోన్న డ్రాగన్!

ట్రంప్ కొత్త రాగం! ఇకపై కిమ్‌ని అలా పిలవను.. వీలైతే ఫ్రెండ్షిప్ చేసుకుంటా..ట్రంప్ కొత్త రాగం! ఇకపై కిమ్‌ని అలా పిలవను.. వీలైతే ఫ్రెండ్షిప్ చేసుకుంటా..

ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ వరుస క్షిపణి పరీక్షలకు పాల్పడి ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేయడం, తన చిరకాల ప్రత్యర్థి అయిన అమెరికా భూభాగం తమ టార్గెట్ లోకి వచ్చిందంటూ సంచలన ప్రకటన చేయడం తెలిసిందే.

Withdraw your troops from Korean Peninsula, China's suggestion to America

ఈ నేపథ్యంలో ఉత్తరకొరియాను అదుపులోకి తీసుకొచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు తనదైన శైలిలో వాగ్భాణాలు విసురుతూనే.. మరోవైపు ఐక్యరాజ్య సమితిచే ఆ దేశంపై ఆంక్షలు కూడా విధింపజేశారు.

అయినా ఉత్తరకొరియా ఖాతరు చేయకపోవడంతో రెచ్చిపోయిన ట్రంప్ ఇక ఉత్తరకొరియా విషయంలో ఒకే మార్గం మిగిలి ఉందని ప్రకటించారు. దీంతో అమెరికా సైన్యాధికారులు ఏ క్షణంలోనైనా ఉత్తరకొరియాపై దాడికి అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చనే ఉద్దేశంతో యుద్ధసన్నాహాలు ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో అమెరికా సైన్యం, అధునాతన మిస్సైల్ వ్యవస్థ 'థాడ్' దక్షిణ కొరియాలో మోహరించాయి. అంతేకాకుండా అమెరికా శక్తి ఏమిటో ఉత్తరకొరియాకు తెలియజేసేలా జపాన్, దక్షిణ కొరియాలతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలను కూడా నిర్వహించారు.

ఆసియా దేశాలతో ఉత్తరకొరియా సంబంధాలను తెంచేసే ఉద్దేశంతో ఇటీవల ట్రంప్ ఆసియా దేశాల పర్యటన కూడా జరిపారు. ఉత్తరకొరియాకు.. చైనాకు మిత్ర దేశం కావడంతో కిమ్ జాంగ్ ఉన్ కు నచ్చజెప్పమంటూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ను కూడా కోరారు.

ఈ నేపథ్యంలో... ఉత్తరకొరియా ద్వీపకల్పంలో అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి సైనిక, నౌకాదళ విన్యాసాలు నిర్వహించడాన్ని వెంటనే నిలిపేయాలని చైనా హితవు పలికింది. ఆ విన్యాసాల వల్ల కొరియా ద్వీపకల్పంలోని రెండు దేశాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చైనా ఆరోపిస్తోంది.

అంతేకాదు, శాంతి కోరుకునే దేశాలు ఏవి ఇలాంటి పని చేయబోవంటూ.. అమెరికా కూడా అలాంటి పని చేయబోదని నమ్ముతున్నామని చైనా పేర్కొంది. ఉద్రిక్తతను తగ్గించే దిశగా.. ఉత్తరకొరియా, దక్షిణకొరియా సరిహద్దుల్లో తిష్టవేసిన అమెరికా సైనికులను కూడా వెనక్కి పంపేయాలని చైనా సూచిస్తోంది.

ఉత్తరకొరియా అణు పరీక్షలు జరపకుండా చూసే బాధ్యత తమపై ఉందని, తమ ప్రయత్నం తాము చేస్తూనే ఉన్నామని, అందుకే రెండు నెలలుగా ఉత్తరకొరియా కూడా ఎలాంటి క్షిపణి పరీక్షలు నిర్వహించకుండూ మిన్నకుండిపోయిందని చైనా చెబుతోంది.

అంతేకాదు, అమెరికా నిజంగా శాంతిని కోరుకునే దేశమే అయితే, వెంటనే తన సైనికులను ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల నుంచి ఉపసంహరించాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఇరకాటంలో పడేసింది. మరి ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

English summary
China has given a shock to America by saying that If North Korea's Dictator Kim Jong Un should listen China's words.. US should withdraw it's troops from the Korean Peninsula. And also China suggested to stop the America's show of force air drills immediately because If US really wants to establish peace.. it should not provoke North Korea in any manner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X