ముద్దు పెడుతూ ప్రియుడి నాలుకని కొరికింది, కేసు
హార్డ్‌ఫోర్డ్: ఓ ప్రియురాలు తన ప్రియుడిని చుంబిస్తూ అతని నాలుకను కొరికింది, దీంతో అతని నాలుక తెగిపోయింది. దీంతో ప్రియురాలిపై కేసు నమోదయిన సంఘటన అమెరికాలో జరిగింది. కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్ట్ సిటీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

షకియా లాంగ్ అనే 37 ఏళ్ల మహిళ తన ప్రియుడు డ్వేన్ విలియమ్స్‌తో కలిసి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఇంట్లో మత్తు పదార్థాలను మోతాదుకు మించి తీసుకున్న అనంతరం విలియమ్స్‌కు ముద్దు పెడుతూ.. షకియా లాంగ్ అతని నాలుకను కొరికింది.
ఒక్కసారిగా నాలుక తెగిపోవడంతో బయటకు పరుగెత్తిన విలియమ్స్ అటుగా వెళ్తున్న పోలీసు సహాయంతో ఆసుపత్రికి చేరాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు షకియా పైన కేసు నమోదు చేశారు. తెగిపడిన నాలుగను వైద్యులు కష్టం మీద అతికించారు. మార్చ్ 31న కేసుకు సంబంధించి ప్రియురాలు షకియా కోర్టుకు రానుంది.












Click it and Unblock the Notifications