బాయ్‌ఫ్రెండ్‌పై కండోమ్స్‌తో ప్రియురాలు దాడి, యువతి గొడవే..
ఫ్లోరిడా: 19 ఏళ్ల యువతిని తన బాయ్ ఫ్రెండ్ పైన కండోమ్స్ బాక్స్‌తో దాడి చేసినందుకు పోలీసులు అరెస్టు చేశారు. సదరు బాయ్ ఫ్రెండ్ వయస్సు కూడా పంతొమ్మిదే. మరో యువతి విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె ప్రియుడి పైన దాడికి పాల్పడింది.
డొమినిక్ క్లారిడ్జ్ (ప్రియురాలు), విలియమ్ హెసియాన్‌లు (బాయ్ ఫ్రెండ్) కారులో ఇంటికి వెళ్తుండగా.. వారి మధ్య మరో యువతి గురించిన చర్చ వచ్చింది. ఆ యువతి విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో యువతి బాయ్ ఫ్రెండ్ పైన కండోమ్స్ బాక్స్‌తో దాడి చేసింది.

ఈ సంఘటన శనివారం నాడు జరిగింది. ఇరువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన గర్ల్ ఫ్రెండ్ తన పైన పలుమార్లు దాడికి పాల్పడిందని పోలీసులకు హెసియాన్ చెప్పాడు. ఫ్లోరిడాలోని బార్డిన్టన్ ప్రాంతంలో ఆమె తన పైన దాడికి పాల్పడిందని ఆరోపించాడు.
అయితే, తాను తన బాయ్ ఫ్రెండ్‌ను కొట్టలేదని ఆమె చెబుతోంది. తన పైన ప్రియుడు దాడి చేస్తుంటే తాను కండోమ్స్ బాక్స్‌ను అడ్డుపెట్టానని డొమినిక్ చెప్పింది. పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఇరువురి శరీరాల పైన గాయాలు ఉన్నాయి. ఇరువురి పైన దాడి కేసులు పెట్టారు. అనంతరం వారు సోమవారం మధ్యాహ్నం జైలు నుండి విడుదలయ్యారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications