వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జుట్టుపట్టి లాక్కొచ్చి.. మహిళపై దారుణం, మృతి (ఫోటో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బ్రెజిల్: బ్రెజిల్‌లో దారుణం జరిగింది. చేతబడి చేస్తోందని, పిల్లలను ఎత్తుకుపోతోందని ఆరోపణల నేపథ్యంలో పలువురు ఆమెను నడివీధిలో దారుణంగా హింసించి చంపేశారు! ఈ ఘటన సావ్ పౌలోకు డెబ్బై కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంలో జరిగింది. 33 ఏళ్ల వయస్సు గల ఫాబియానో మరియా అనే మహిళను పలువురు గుమికూడి దారుణంగా కొట్టారు.

దీంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనకు వీడియో సాక్ష్యంగా ఉందట. ఈ వీడియో ఇప్పుడు బ్రెజిల్ మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కి సంచలనం సృష్టిస్తోందట.

woman brutally lynched death over facebook hoax

సదరు వీడియోలో ఫాబియానో మరియాను పలువురు రోడ్డు పైన లాక్కెళ్తూ.. ఆమెను తమ కాళ్లతో తన్నుతున్నారు. మరికొందరు ఆమె జుత్తును పట్టుకొని లాక్కెళ్తున్నారు. ఇంకొందరు సైకిల్ టైర్లను ఆమె నెత్తి మీద నుండి తీసుకు వెళ్లారు. ఓ వ్యక్తి ఆమె తల పైన రాయితో కొడుతున్నాడు. ఆమెను దారుణంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది.

woman brutally lynched death over facebook hoax

ఈ ఘటనను చూసిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడింది. ఆ తర్వాత మృతి చెందింది. ఇంటర్నెట్లో ఈ వీడియో కలచి వేసేలా ఉంది.

English summary
A woman was brutally killed in Brazil following some rumors that spread about her. She was accused of carrying the activities of black magic and abducting kids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X