మహిళ ముఖాన్ని చుట్టుకున్న పాము: హెల్ప్ ప్లీజ్ అంటూ ఎమర్జెన్సీ నంబర్‌కి కాల్

తానో పామును రక్షించానని, దాని పొడవు సుమారు 1.7మీ. ఉందని, కానీ దురదృష్టం కొద్ది అదే పాము తన ముఖానికి చుట్టుకుందని ఫిర్యాదు చేసింది. హెల్ప్ ప్లీజ్.. అంటూ రక్షించాలని వేడుకుంది.

అమెరికా: విష జంతువు పట్ల మనుషులకు కనికరం ఉండవచ్చు కానీ.. అది మాత్రం విషాన్నే చిమ్ముతుంది అన్న నిజం మరిచిపోకూడదు. అమెరికాకు చెందిన ఓ మహిళ.. పామును రక్షించబోయి ఇలాగే కష్టాల్లో పడింది. రక్షించిన పాపానికి అదే పాము ఆమెను బలితీసుకోబోయింది.

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఒహియోకు చెందిన 45ఏళ్ల మహిళ ఎమర్జెన్సీ నంబర్ 911కు ఫోన్ చేసింది. తానో పామును రక్షించానని, దాని పొడవు సుమారు 1.7మీ. ఉందని, కానీ దురదృష్టం కొద్ది అదే పాము తన ముఖానికి చుట్టుకుందని ఫిర్యాదు చేసింది. హెల్ప్ ప్లీజ్.. అంటూ రక్షించాలని వేడుకుంది.

Woman calls 911 after boa constrictor wraps around her head, bites her nose: 'There's blood everywhere'

పాము తన ముక్కును కొరికేస్తుందని కూడా వాపోయింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఫైర్‌ఫైటర్స్‌, పోలీసులు ఒహియోలో ఆమె చెప్పిన ప్రాంతానికి చేరుకున్నారు. మహిళ ముఖం చుట్టూ పాము చుట్టుకుని ఉండటాన్ని గమనించిన పోలీసులు.. దాని తలను కోసి ఆమెను విడిపించారు.

ఆపై చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇంతకుముందు కూడా తాను పాములను పెంచుకున్నానని, కానీ ఇలాంటి పరిస్థితి తనకెప్పుడూ ఎదురవలేదని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+