ఫేస్‌బుక్ చాటింగ్.. ఆమెను నమ్మితే ఇక అంతే!: హోటల్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి..
ఆ యువతితో కలిసి హోటల్ వద్దకు వెళ్లగా.. ఆమె చెప్పిన రూమ్ లో కొందరు యువకులు టీనేజీ అమ్మాయిలతో కనిపించారు.
ఫ్లోరిడా: ఉద్యోగాల పేరుతో అందమైన యువతులకు వల వేసి మోసగిస్తున్న ఓ యువతి అడ్డంగా బుక్కైపోయింది. ఫేస్ బుక్ లో అందమైన యువతులను బోల్తా కొట్టించి.. వారి ఫోటోలతో పలు అశ్లీల సైట్లలో యాడ్స్ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ యువతి ఫిర్యాదు మేరకు తీగ లాగిన పోలీసులు.. నిందితురాలి బాగోతాన్ని బట్టబయలు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. డేస్టేనీ సన్‌టేల్లీ(19) అనే అమ్మాయి డబ్బు సంపాదనకు ఫేస్ బుక్ మార్గాన్ని ఎంచుకుంది. అందమైన యువతులకు రిక్వెస్టులు పెట్టి వారితో మాటలు కలిపేది. మెల్లగా సాన్నిహిత్యం పెరుగుతున్న కొద్ది.. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించేది. ఇందుకోసం వారి వద్ద నుంచి అందమైన ఫోటోలు రాబట్టేది. ఆపై వాటిని ఆన్ లైన్ లో అసభ్యకర రీతిలో పోస్టు చేస్తూ యాడ్స్ ఇచ్చేది.

ఇటీవల ఓ యువతికి సంబంధించి ఫోటోలు ఓ ఆన్ లైన్ యాడ్ లో అసభ్యంగా కనిపించడంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పథకం ప్రకారం ఆమెను అరెస్టు చేశారు. తొలుత ఒక అమ్మాయి చేత డేస్టేనీకి ఫొన్ చేయించారు. దీంతో పలానా హోటల్ కు రావాలని చెప్పింది.
వెంటనే పోలీసులు ఆ యువతితో కలిసి హోటల్ వద్దకు వెళ్లగా.. ఆమె చెప్పిన రూమ్ లో కొందరు యువకులు టీనేజీ అమ్మాయిలతో కనిపించారు. దీన్నిబట్టి సీన్ అర్థం చేసుకున్న పోలీసులు వ్యభిచార ఆరోపణల కింద ఆమెపై కేసు నమోదు చేసుకున్నారు. డేస్టేనీని అరెస్టు చేసి విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications