ఘోర విషాదం: ఆసుపత్రి లిఫ్టులో ఇరుక్కుపోయి ముక్కలైన మహిళ..
దక్షిణ స్పెయిన్ లోని వాల్మే హాస్పిటల్‌లో విషాదం చోటు చేసుకుంది. రోషియోనునేజ్ అనే మహిళ లిఫ్ట్ డోర్‌లో చిక్కుకుపోవడంతో ఆమె శరీరం రెండు ముక్కలైంది.
స్పెయిన్: దక్షిణ స్పెయిన్ లోని వాల్మే హాస్పిటల్‌లో విషాదం చోటు చేసుకుంది. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన రోషియోనునేజ్ అనే మహిళ లిఫ్ట్ డోర్‌లో చిక్కుకుపోవడంతో ఆమె శరీరం రెండు ముక్కలైంది. ఈ ఘోర ప్రమాదంలో ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం పట్ల ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆసుపత్రికి చెందిన ఆయా రోషియోనేజ్ ను రెండో ఫ్లోర్ నుంచి మూడో ఫ్లోర్ కు తీసుకెళ్లింది. ఈ క్రమంలో రోషియోనేజ్ ను లిఫ్ట్ ద్వారా తీసుకెళ్తుండగా.. లిఫ్ట్ మధ్యలో ఆగిపోయి డోర్లు తెరుచుకున్నాయి. అందులో ఉన్న ఇద్దరు నర్సులు బయటకు రాగా, రోషియోనేజ్ బయటకు వస్తున్న క్రమంలో లిఫ్ట్ అకస్మాత్తుగా మళ్లీ క్లోజ్ అయింది.

దీంతో ఆమె శరీరం రెండు తలుపుల మధ్య పూర్తిగా నలిగిపోయి ఛిద్రమైపోయింది. ఆదివారం మధ్యాహ్నాం 2.30గం సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. నిజానికి ఆ లిఫ్ట్ అగస్టు 12వ తేదీ నుంచి సరిగా పనిచేయడం లేదని, అయినా ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి.
ఆసుపత్రి యాజమాన్యం దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications