పార్టీకి పిలిచి 2సార్లు రేప్ చేశాడు: ఫుట్‌బాలర్‌పై ఫిర్యాదు

లండన్: పార్టీకి వెళ్లిన తనపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని సుందర్ లాండ్ మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ కాబ్రాల్‌పై 21ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుకు సంబంధించి విచారణను ఎదుర్కొనేందుకు ఆయన హల్ క్రౌన్‌లో కోర్టుకు హాజరయ్యారు. కాబ్రాల్ అసలు పేరు అడిల్సన్ తావెరిస్ వరేలా.

ఏడాది క్రితం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. నిరుడు న్యూక్యాజిల్‌లోని నైట్ క్లబ్‌కు రాత్రి కలిసేందుకు కాబ్రాల్ ఆమెను రమ్మన్నాడు. దీంతో ఆమె తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి వెళ్లింది.

అనంతరం ఆమె తప్ప తన స్నేహితురాళ్లు వీఐపీ గదిలో కూర్చుని బాగా మద్యం సేవించారు. మందుకోసమే అతడు దాదాపు రూ.1,16,092 ఖర్చుచేశాడు. అక్కడే క్లబ్బులో డాన్స్ చేశారు. అనంతరం బాధిత యువతిని అక్కడి నుంచి అతడి ప్రైవేటు నివాసానికి ఓ కారు తీసుకొని వెళ్లారు.

Woman claims then Premier League footballer raped her twice

స్నేహితురాళ్లు అక్కడ కూడా పార్టీలో మునిగితేలుతుండగా.. బాధితురాలిని మాత్రం కాబ్రాల్ తన బెడ్ రూంకు తీసుకెళ్లి కూర్చొబెట్టాడు. అనంతరం మందు తాగుతావా? అని అడిగాడు. అలవాటు లేదని చెప్పడంతో ఎందుకని ప్రశ్నించాడు.

తనకు ముందునుంచే అలవాటు లేదని చెప్తుండగానే కండోమ్ తీశాడు. ఎంత వారించినా వినకుండా ఆమెపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎంత ఏడ్చినా ఆమె మాట వినలేదు అతడు. గట్గిగా కేకలు వేసినా.. పార్టీలో ఉన్న ఆమె స్నేహితురాళ్లకి వినిపించలేదు.

ఆ తర్వాత స్నేహితురాళ్లతో విషయం చెప్పినట్లు తెలిపింది బాధితురాలు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. బాధితురాలు కోర్టు ఎదుట తన వాంగ్మూలాన్ని వినిపించింది. కాగా, కాబ్రాల్ మాత్రం ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని అంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+