యోనిలో ఆయుధాన్ని దాచిన మహిళ
లండన్: ఓ మహిళ పోలీసులకు ఆయుధంతో పట్టుబడకుండా ఉండడానికి విచిత్రమైన పని చేసింది. డలాస్ ఆర్చర్ (21) అనే మహిళ పోలీసులకు దొరకకుండా ఉండేందుకు చేసిన ఆమె ప్రయత్నం విఫలమైంది. దాంతో కోర్టు ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
ఉత్తర లండన్‌కు చెందిన ఆర్చర్ గత గురువారం తన కారులో వెళ్తోంది. ఆమెతోపాటు ఆ కారులో లోడెడ్ గన్ కూడా ఉంది. అయితే కొంత దూరం రాగానే పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండడాన్ని ఆమె చూసింది. దాంతో ఏమి చేయాలో తెలియక ఆ లోడెడ్ గన్‌ను తన యోని లోపలికి తోసేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు ముందుకెళ్లింది. పోలీసులు ఆమెను ఆపి తనిఖీ చేశారు.

లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ పేపర్స్ చూపించమని అడిగారు. ఆమె చూపించిన లైసెన్స్ ఫేక్ అని తేలడంతో పోలీసులు ఆర్చర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఈమె నడకలోని తేడాని గమనించిన పోలీసులు లేడీ పోలీసుతో తనిఖీ చేయించారు. ఆ లేడీ పోలీస్ ఆర్చర్‌ను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి మొత్తం బట్టలన్నీ విప్పించి తనిఖీ చేసింది.
అప్పుడు ఆమె జననాంగంలోని రివాల్వర్ బయటపడింది. అది పూర్తిగా లోడ్ అయి ఉంది. ఆమె అక్కడ దాచిన లోడెడ్ గన్‌ను చూసి ఆశ్చర్యపోయిన లేడీ పోలీస్ ఈ విషయాన్ని పై అధికారులకు చెప్పింది. దీంతో ఆమెను వెంటనే అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశ పెట్టారు.
ఆ గన్‌ను ఓ 70 ఏళ్ల వ్యక్తి నుంచి దొంగతనం చేశానని ఆమె ఒప్పుకోవడంతో ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పుచెప్పింది. అయితే ఆ గన్ ఎందుకు తీసుకువెళ్తోందన్న వివరాలు పోలీసులు వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications