నిద్ర పోనివ్వడం లేదని చిన్నారి వేళ్లు కత్తితో నరికింది
బీజింగ్: తన నిద్రకు భంగం కలిగిస్తున్నాడని ఆరేళ్ల చిన్న పిల్లాడి చేతివేళ్లను ఓ మహిళ కోసేసిన సంఘటన చైనాలో జరిగింది. లియూ షాడాంగ్... కౌంటీలోని తన సోదరి ఇంటికి వెళ్లింది. అదే సమయంలో పక్కింట్లో ఉండే షామింగ్ అనే ఓ ఆరేళ్ల బాలుడు ఆడుకోవడానికి వచ్చాడు.
ఇంతలో లియూకు నిద్ర వచ్చింది. దీంతో ఆమె వెళ్లి పడుకొంది. బాలుడు అల్లరి చేస్తుండడంతో వాడిని వారి ఇంటికి పంపించింది. కాసేపటి తర్వాత ఆ బాలుడు మళ్లీ వచ్చాడు.

దీంతో లియూ చిన్నపిల్లాడని కూడా చూడకుండా కత్తితో బాలుడి చేతి వేళ్లు, మర్మాంగాలను కోసేసి, తల, మొహంపై గాయపరిచింది. పిల్లాడి వేళ్లు పూర్తిగా తెగిపోయాయని, మాట్లాడే పరిస్థితులో లేడని, పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.
ఈ ఘటన తర్వాత లియూ పారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు లియూ నివసించే ప్రాంతానికి వెళ్లి గాలించారు. ఆమెను అరెస్టు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన లియూ దాదాపు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె స్క్రిజోఫ్రినియాతో బాధపడుతోందని చెబుతున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications