కారులో పెనుగులాట, మెక్ డొనాల్డ్‌లోకి వచ్చి స్త్రీని కాల్చేశాడు, తానూ కాల్చుకున్నాడు
గోల్డ్ కోస్ట్: ఆస్ట్రేలియాలో మెక్ డొనాల్డ్ రెస్టారెంటులో ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ (49) మృతి చెందింది. క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలోని గోల్డ్ కోస్ట్ సిటీలో ఈ దారుణం జరిగింది.
హంతకుడు, బాధితురాలు ఒకరికి ఒకరు పరిచయమున్నట్లుగానే పోలీసులు భావిస్తున్నారు. వారిద్దరు ఈ ఘటనకు ముందు రెస్టారెంట్ బయట కారులో పెనుగులాడినట్లు ప్రత్యక్ష సాక్షుల చెబుతున్నారు. అక్కడి నుంచి తప్పించుకున్న మహిళ రెస్టారెంట్‌లోకి వెళ్ళింది.

అమెను అనుసరించిన దుండగుడు డైనింగ్ హాలు వద్ద మహిళను తన చేతులలో బంధించాడు. అనంతరం ఆమెను కాల్చి చంపాడు. అతను ఆ తర్వాత తనను తాను కూడా తలలో కాల్చుకున్నాడు. అతనిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలు అక్కడికి అక్కడే మృతి చెందింది. నిందితుడిని మాత్రం గోల్డ్ కోస్ట్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. వారిద్దరు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications