కదులుతున్న కారులో బిడ్డకు జన్మ (వీడియో)
టెక్సాస్: కదులుతున్న కారులోనే మహిళ పండంటి బిడ్డకు జన్మనిశ్చింది. పక్కనే ఉన్న ఆమె భర్త ధైర్యం చెబుతూ ఆసుపత్రి దగ్గరకు వెళుతున్న సమయంలో ఆమె కారులోనే ప్రసవించింది. టెక్సాస్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి.
టెక్సాస్ కు చెందిన లిసియా పెట్టిజాన్ అనే మహిళకు పురిటి నోప్పులు వచ్చాయి. విషయం గుర్తించిన ఆమె భర్త ఆసుపత్రికి తీసుకు వెళ్లడానికి బయలుదేరాడు. లిసియా కారు ముందు సీటులో కుర్చుని ఉంది. ఆమె భర్త కారు నడుపుతున్నాడు. అయితే కారులో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి.

లిసియా భర్త మొబైల్ లో దృశ్యాలు రికార్డు చేస్తు కారు నడుపుతున్నాడు. లిసియా కారులోనే బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత తల్లి, బిడ్డను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. లిసియా దంపతులకు అంతకు ముందే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు మరొ బిడ్డకు జన్మనిశ్చింది.












Click it and Unblock the Notifications