ఆ ఇళ్లు ఒక పాముల పుట్ట: మెడకు చుట్టేసిన కొండ చిలువ..మహిళ మృతి
పాలు పోసిన పామే పగబట్టి చంపినట్లు ఇంట్లో పెంచుకుంటున్న పాము ఒకటి ఓ మహిళ మెడకు చుట్టుకుని నలిపివేయడంతో ఊపిరి ఆడక మృతి చెందిన ఘటన అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఆ ఇళ్లు పాముల పుట్ట
అమెరికాలో ఓ మహిళ మెడకు 8 అడుగుల పెద్ద కొండ చిలువ చుట్టుకుని ఊపిరి ఆడక మృతి చెందింది. లారా హస్ట్ అనే 38 ఏళ్ల మహిళ బుధవారం ఓ ఇంటికి వెళ్లింది. ఆ ఇళ్లు ఒక పాముల పుట్ట. ఆ ఇంట్లో 140 పాములు బుసకొడుతూ ఉంటాయి. ఆ ఇంటి ఓనరు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వ్యక్తి. అయితే బుధవారం లారా ఇంట్లోకి వెళుతున్న సమయంలో ఆయన చూశాడు. ఇక అప్పటి నుంచి ఇంటి నుంచి లారా బయటకు రాలేదు.

మహిళ కంఠంపై కొండచిలువ స్వారీ
24 గంటలు గడిచినా లారా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూడగా లారా విగతజీవిగా పడి ఉంది. ఆమె మెడ చుట్టూ ఓ పెద్ద కొండచిలువ చుట్టుకుని ఉంది. ఇది గమనించిన ఇంటి ఓనరు వెంటనే హాస్పిటల్ సిబ్బందికి కబురు పెట్టారు. ఇంటికి చేరుకున్న సిబ్బంది లారా మెడకు చుట్టుకున్న కొండ చిలువను తొలగించేందుకు చాలా కష్టపడ్డారు. ఆ కొండ చిలువ మెడను చాలా గట్టిగా పట్టేసుకుంది. ఎట్టకేలకు లారా మెడనుంచి కొండచిలువను వేరుచేయడంలో సక్సెస్ అయ్యింది సిబ్బంది. ఇక వెంటనే ఆమెను బతికించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ అప్పటికే లారా మృతి చెందినట్లు తెలిపారు.

ఆ ఇంట్లో 140 పాములు బుస కొడుతూ ఉంటాయి
అయితే పాము మెడకు బిగ్గరగా చుట్టుకోవడం వల్లే ఊపిరి ఆడక మరణించి ఉంటుందనే ప్రాథమిక అంచనాకు వచ్చింది మెడికల్ సిబ్బంది. అయితే లారా మృతదేహంను పోస్టుమార్టంకు పంపినట్లు చెప్పారు. నివేదిక వస్తే కానీ లారా మృతిపై మిస్టరీ వీడదని మెడికల్ సిబ్బంది పేర్కొంది. ఇక ఆ ఇంట్లో 140 పాములు ఉండగా అందులో 20 పాములు లారాకు చెందినవి. ఆ పాములు అక్కడే ఉంటాయని వారానికి రెండు సార్లు లారా వచ్చి వాటి బాగోగులను చూసుకుని వెళుతూ ఉంటుందని ఇంటి యజమాని తెలిపారు. ఇక ఆ ఇళ్లు కేవలం పాముల కోసమే రెనోవేట్ చేసినట్లు చెప్పాడు ఇంటి యజమాని. ఆ పాముల కోసం ప్రత్యేకంగా పంజరాలు చేసి ఉంచినట్లు చెప్పిన యజమాని కొన్ని పాములు అలా బయటనే తిరుగుతుంటాయని వెల్లడించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications