వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి ప్రతిపాదన: ఆనందమే ప్రియురాలి ప్రాణం తీసింది

|
Google Oneindia TeluguNews

లండన్: తన ప్రియురాలికి ఎంతో ఉత్సాహంగా పెళ్లి ప్రతిపాదన చేశాడు ఓ యువకుడు. అంతుపట్టని ఆనందంతో ఎగిరి గంతేసిన ప్రియురాలు కొండపైనుంచి పడి మృతి చెందింది. దీంతో ఆమెను ఎంతో ప్రేమించిన ఆ యువకుడు విషాదంలో మునిగిపోయాడు. ఈ ఘటన లండన్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బల్గేరియాకు చెందిన దిమిత్రినా దిమిత్రోవా(29) ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో గత కొంత కాలంగా వారు ప్రేమ ప్రమాయణం కొనసాగిస్తున్నారు. ఇక పెళ్లి సమయం వచ్చేసిందని భావించిన ప్రియుడు పెళ్లి ప్రస్తావనను ప్రియురాలి చెంతకు చెరవేయాలని భావించాడు.

ఈ నేపథ్యంలో తన ప్రతిపాదనను ప్రియురాలికి తెలిపేందుకు ఆమెను తన వద్దకు ఆహ్వానించాడు. వీరిద్దరూ కలిసి ఏకాంతంగా ఒక కొండపైకి వెళ్లారు. కాసేపు ముచ్చట్లు చెప్పుకున్న తర్వాత.. ప్రియుడు తన ప్రియురాలికి మనుసులోని మాటను చెప్పాడు.

 Woman dies while celebrating marriage proposal

‘నిన్ను నేను త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నువ్వు సిద్ధమే కదా?' అని ప్రియుడు తన ప్రియురాలితో చెప్పాడు. దీంతో ఆ యువతి పట్టలేని ఆనందంతో ఎగిరి గంతేసింది. ఆమె ఉన్నది కొండపైన అనే సంగతి కూడా మరిచిపోయింది.

ఎగిరిగంతేసిన ఆ యువతి అదుపుతప్పి కొండపై నుంచి కిందపడిపోయింది. 60 అడుగుల ఎత్తైన ఆ కొండపై నుంచి పడటంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె తుదిశ్వాస విడిచింది. తన సొంతమవుతుందనుకున్న ప్రియురాలు శాశ్వతంగా దూరం కావడంతో ఆ ప్రియుడు కన్నీటి పర్యాంతమయ్యాడు.

English summary
A woman fell off a cliff and died after jumping up in excitement as her boyfriend proposed to her on top of a cliff in the Spanish island of Ibiza, media reported on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X