Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యోగా చేస్తూ..పట్టు తప్పి..80 అడుగుల ఎత్తు నుంచి కిందికి జారి!

మెక్సికో సిటీ: ప్రమాదకరమైన యోగాసనాన్ని వేయబోయిన ఓ యువతి తన ప్రాణాల మీదికి తెచ్చుకుంది. 80 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ.. తీవ్ర గాయాలపాలైంది. ఆమె శరీరంలో కనీసం 110 ఎముకలు విరిగి ఉంటాయని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన మెక్సికోలోని శాన్ పెడ్రోలో చోటు చేసుకుంది. ఆ యువతి పేరు అలెక్సా టెర్రజా. యోగాసనాలు వేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం.

యోగాసనాలతో సాహసోపేత విన్యాసాలను చేయడంలో ఆమెకు మంచి పేరు కూడా ఉందని అంటున్నారు స్థానికులు. శాన్ పెడ్రాలోని ఓ అపార్ట్ మెంట్ లో తన స్నేహితురాలితో కలిసి నివసిస్తోన్న అలెక్సా.. యోగాలో సరికొత్త విన్యాసాన్ని ప్రదర్శించబోయారు. అపార్ట్ మెంట్ ఆరో అంతస్తులో ఉన్న తన ఫ్లాట్ బాల్కనీలో రెయిలింగ్ లను పట్టుకుని తలకిందులుగా యోగాసనాలను వేయాలని నిర్ణయించారు.

 Woman Falls 80 Feet From Balcony While Attempting Yoga Pose

నిర్ణయం తీసుకున్నదే తడవుగా అలెక్సా దాన్ని ఆచరణలో పెట్టారు. బాల్కనీ రెయిలింగ్ కు ఆవలి వైపు తలకిందులుగా గాల్లో వేలాడుతూ యోగాసనాన్ని వేయబోయారు. కొద్దినిమిషాల పాటు మాత్రమే ఆమె అలా ఉండగలిగారు. వెనక్కి వచ్చే సమయంలో పట్టు తప్పింది. అంతే. సుమారు 80 అడుగుల ఎత్తు నుంచి ధబేల్ మంటూ కిందపడ్డారు. పడ్డ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె స్నేహితురాలు.. అనూహ్యంగా సంభవించిన ఈ ఘటనలో బిత్తరపోయారు.

వెంటనే తోటి అపార్ట్ మెంట్ వాసులను అప్రమత్తం చేశారు. కిందికి వెళ్లే చూసేసరికి అలెక్సా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడటం కనిపించింది. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. అలెక్సా శరీరంలో 110 ఎముకలు విరిగిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఆమె ప్రాణాలతో బయటపడటం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. మోకాళ్లు, కాళ్లు, చేతులు, తల భాగాలు విపరీతంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు రక్తదానం కోసం దాతల సహాయాన్ని కోరారు. ఇప్పటి వరకు 100 మంది రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+