ఫేస్‌బుక్ చూస్తూ సముద్రంలో పడ్డ మహిళ, చేతిలో ఫోన్

ఆమె తన ఫోన్‌లో ఫేస్‌బుక్ చూస్తూ ముందుకు కదులుతోంది. ఫోన్‌నే చూస్తూ నడుస్తుండటంతో ఆమె పక్కనే నీళ్లలో పడిపోయింది. ఆ తర్వాత తాను నడుస్తూ డెడ్ ఎండ్‌కు వచ్చిన విషయాన్ని గుర్తించింది. పోలీసులు ఆమెను కాపాడారు.
తాను ఫేస్‌బుక్ చెక్ చేసుకుంటుండగా ఈ ఘటన జరిగిందని సదరు మహిళ చెప్పిందని స్థానిక పోలీసులు అన్నారు. ఆమె అరవై ఫీట్ల ఎత్తులో ఉన్న వంతెన పైనుండి నీళ్లలో పడింది. నీళ్లలో పడిపోయినప్పుడు కూడా ఆమె చేతిలో ఫోన్ ఉంది. దీంతో ఈదలేకపోయిందని పోలీసులు తెలిపారు.
ఆమె నీళ్లలో పడిపోయిన ఇరవై నిమిషాల తర్వాత బయటకు తీశారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సముద్రంలో పడినప్పటికీ ఆ మహిళ ప్రాణాలతో బయటపడటం లక్కీ అని ఓ పోలీసు అన్నారు.












Click it and Unblock the Notifications