ప్రియుడికి హెచ్ఐవీ: కోపంతో కారుతో గుద్దిన యువతి
అరిజోనా: తన బాయ్‌ఫ్రెండ్‌కు హెచ్‌ఐవీ పాజిటివ్ ఉందని తెలుసుకున్న గర్ల్ ఫ్రెండ్ అతడిని హత్య చేసేందుకు తన కారుతో గుద్దింది. అతడు గాల్లోకి కొన్ని అడుగుల పాటు ఎగిరి కింద పడ్డాడు. ఆ తర్వాత అతనిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు.
ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన అరిజోనాలోని పోనిక్స్‌లో జరిగింది. సీసీటీవీ ఫుటేజీలకు ఈ వీడియో చిక్కింది. దీంతో ప్రియురాలు ఏం చేసిందో బయటపడింది. ఇది రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారు నడిపిన వ్యక్తిని గుర్తించారు.

మిస్టీ లీ విక్కీ అనే మహిళ కారు నడిపింది. ఆమెనే ప్రమాద బాధితుడి ప్రియురాలు అని పోలీసులు గుర్తించారు. అతను సైకిల్ పైన వెళ్తుండగా ఆమె కారుతో గుద్దింది. దీంతో అతను గాల్లోకి ఎగిరి కిందపడ్డాడు.
రెండు నిమిషాల పాటు అలాగే కదలకుండా పడిపోయాడు. ఆ తర్వాత లేచి కొద్ది దూరం నడిచి మళ్లీ పడిపోయాడు. స్థానికులు అతనిని ఆసుపత్రిలో చేర్చారు. విచారణలో.. అతనికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నందున ప్రియురాలే చంపేందుకు అలా చేసిందని తేలింది. ఆ విషయం తనతో చెప్పలేదని ఆమెకు కోపం వచ్చింది. దీంతో చంపాలని నిర్ణయించుకుంది. ఆమె పైన హత్యాయత్నం కేసు పెట్టారు.












Click it and Unblock the Notifications