షాక్: ఫ్రిజ్ కొంటే.. అందులో శరీర భాగాలొచ్చాయి!

వాషింగ్టన్: తక్కువ ధరకు వస్తుంది కాదా అని.. సెకండ్ హ్యాండ్‌లో ఓ ఫ్రిజ్‌ను కొన్న అమెరికా మహిళకు ముచ్చెమటలు పట్టాయి. ఓ గ్యారేజీలో కేవలం 30 డాలర్లకే ఈ సెకండ్ హ్యాండ్ ఫ్రిజ్‌ను ఆనందంగా కొనేసింది. ఈ గ్యారేజ్ తన పొరుగున ఉన్న వారిదే కావడంతో చాలా నమ్మకంతోనే దాన్ని కొన్నానని ఉత్తరకరోలీనాకు చెందిన మహిళ వెల్లడించిది.

తీరా ఇంటికెళ్లి చూస్తే అందులో మానవ శరీరానికి సంబంధించిన భాగాలు ఉన్నాయంటూ విస్మయకర స్వరంతో తెలిపింది. వెంటనే ఈ విషయాన్ని స్థానిక మీడియాకు తెలిపింది. అయితే తమకు ఫ్రిజ్ అమ్మిన పొరుగునున్న వ్యక్తి వెంటనే దీన్ని తెరవద్దని ఇదో టైమ్‌క్యాప్సుల్ అని చెప్పడంతో తాను దాన్ని తెరవలేదని పేర్కొంది.

ఇందులో టైమ్‌క్యాప్సుల్ ఉందికాబట్టి తన ప్రాజెక్టులో భాగంగా చర్చికి దాన్ని అందించాల్సి ఉందని, దానికి సంబంధించిన వ్యక్తులే వచ్చి దీన్ని తీసుకుంటారని కూడా అమ్మిన మహిళ తనకు చెప్పినట్టు వెల్లడించింది.

Woman finds human body parts in freezer she bought from neighbor

అయితే ఎంతకూ ఎవరూ రాకపోవడంతో ఆ ఫ్రిజ్‌ను తానే తెరిచానని అందుంలో మానవ భాగాలు బయటపడ్డాయని తెలిపింది. పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.

తనకు ఈ ఫ్రిజ్‌ను అమ్మిన వెంటనే పొరుగువ్యక్తులు పరారయ్యారని ఆమె పోలీసులకు చెప్పింది. అయితే ఇంట్లో జరిగిన మరణాన్ని ధృవీకరించకుండా ఆ శవాన్ని ఫ్రిజ్‌లో దాచారన్న సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చేసి దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+