మోనాలిసాలా!: యూత్‌ లుక్‌కోసం 40 ఏళ్లుగా ఆమె నవ్వడంలేదు

ఓ మహిళ నలభై ఏళ్లుగా నవ్వడం లేదు. ఆమె పేరు టెస్ క్రిస్టియన్. వయస్సు 50 ఏళ్లు. తన ముఖం పైన ముడతలు పడకుండా ఉండేందుకు ఆమె నలభై ఏళ్లుగా నవ్వడం లేదట. ఎలాంటి ఆనంద సమయంలోను ఆమె బిగ్గరగా నవ్వరు. ఆమెకు సంతానం కూడా ఉంది.

తాను ఎప్పుడు నవ్వకుండా ఉంటానని తనను తన మిత్రులు మోనాలిసా అని పిలుస్తుంటారని చెబుతోంది. మోనాలిసా చిత్రంలో కొంచెం కృత్రిమ నవ్వు ఉండే విషయం తెలిసిందే. ఆమె మగవాళ్లను ఆకర్షించేదుకు నవ్వాల్సిన అవసరం లేదు. ఆమె తన తెలివి, మాటలతోనే ఆకట్టుకుంటారు.

Woman hasn't smiled in 40 years in hopes to avoid wrinkles

తాను నవ్వితే తన బుగ్గలు వికారంగా తయారవుతాయనే ఆందోళనతో అలా చేయనని చెబుతోంది. ఆమె తన కూతురితో సంతోషాన్ని పంచుకుంటుంది. కానీ అది మాటల వరకే. నవ్వడం మాత్రం ఉండదు. కెమికల్ ఇంజెక్షన్స్ కంటే నవ్వకుండా ఉంటూ గ్లామరస్‌గా ఉండే తన ఎంపికనే అద్భుతమని చెబుతోంది.

ఆమె తన కూతురు పుట్టినప్పుడు కూడా నవ్వలేదు. తనకు కూతురు జన్మించినప్పుడు చాలా సంతోషించానని, కానీ నవ్వలేదని చెప్పింది. తాను నిత్యం నవ్వకుండా ఉండటం వల్ల తన ముఖం యూత్‌ఫుల్‌గా కనిపిస్తోందని చెబుతోంది. బ్యూటీ క్రీమ్స్, ఇతరత్రా కంటే ఇదే మేలని అంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+