చిన్నారిని బ్యాగ్‌లో దాచి విమానంలో తీసుకెళ్లింది!

ఇస్తాంబుల్: ఓ మహిళ నాలుగేళ్ల చిన్నారితో విమాన ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే, ఆ చిన్నారికి టికెట్ తీసుకోకుండానే తన ప్రయాణం కొనసాగించాలని ఆ మహిళ ఓ పథకం వేసింది. వెంటనే ఆమె దగ్గరున్న బ్యాగులో ఆ పాపను దాచిపెట్టి విమానంలోకి ఎక్కేసింది. ఆమెను విమానాశ్రయ తనిఖీల్లో కూడా గుర్తించకపోవడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్ దేశానికి చెందిన సదరు మహిళ.. ఇస్తాంబుల్ (టర్కీ) నుంచి పారిస్‌కు వెళుతోంది. హైతీకి చెందిన బాలికను దత్తత తీసుకునేందుకు తీసుకెళుతున్న ఆమె.. ఆ చిన్నారిని తన బ్యాగులో దాచేసి ఎయిర్‌ఫ్రాన్స్ విమానంలో ఎక్కింది.

Woman hides four-year-old child in bag on flight from Istanbul to Paris

కాగా, విమానంలో తోటి ప్రయాణికులు గుర్తించడంతో ఈ విషయం బయటపడింది. అయితే, ఇస్తాంబుల్ విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు చేపట్టినా బ్యాగ్ లోపల పాపను దాచిన విషయాన్ని గుర్తించలేకపోవడం గమనార్హం.

తనిఖీల నుంచి తప్పించుకున్న ఆ మహిళ విమానంలో పాపను తన కాళ్ల వద్ద ఉంచి దుప్పటి కప్పింది. అయితే, ఆ బాలికను టాయ్‌లెట్‌కు తీసుకెళ్లే సమయంలో ఇతర ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి తెలియజేశారు. దీంతో ప్యారిస్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత అధికారులు ఆ మహిళను, పాపను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+