ప్రియుడ్ని పరీక్షించేందుకు పోర్న్ స్టార్‌ను పంపింది, షాకిచ్చాడు
లండన్: ఓ ప్రియురాలు తన ప్రియుడిని పరీక్షించేందుకు ఓ పోర్న్ స్టార్‌ను అతని వద్దకు పంపించిన సంఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. బాయ్ ఫ్రెండ్ నిజాయితీని పరీక్షించేందుకు ఆమె చేసిన పని ఇప్పుడు వార్త అయి కూర్చుంది.
తన బాయ్ ఫ్రెండ్ నిజయతీని పరీక్షించేందుకు సదరు ప్రేమికురాలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. గర్ల్‌ఫ్రెండ్ తనను పరీక్షించాలనుకుందన్న విషయం తెలిసిన అతడి మనసు ముక్కలైంది.
బ్రిటన్‌కు చెందిన ప్రేమికురాలు అతడి ప్రియుడిని పరీక్షించేందుకు వెలెరీస్ చార్మ్స్ అనే పోర్న్‌స్టార్‌ను తన బాయ్‌ఫ్రెండ్ వద్దకు పంపింది. ఓ బుక్‌స్టాల్ వద్ద అతడిని కలిసిన వెలెరీ మాటలు కలిపింది. మాటలతో అతడిని పడేసింది.

ముందు అతడు ఆమెకు దూరంగా ఉన్నా తర్వాత ఆమె అతడిని కన్విన్స్ చేసి అతడి ఫోన్ నంబరు తీసుకుంది. నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగింది. అతను అవునని సమాధానం చెప్పాడు. అతడి ఫోన్ నంబరు తీసుకొని రాత్రికి ఇంటికి వస్తానని చెప్పింది.
దానికి అతను ఎందుకని ప్రశ్నించాడు. ఆమె చెప్పిన సమాధానంతో అతను షాక్‌కు గురయ్యాడు. తాను పోర్న్‌స్టార్‌నని, మరికొద్ది రోజుల్లో షూటింగ్ ఉందని, కొత్తగా ప్రయత్నించేందుకు ఇంటికొస్తానని చెప్పింది. గర్ల్ ఫ్రెండ్ ఉన్నా పర్వాలేదని చెప్పింది. అతను అడ్రస్ చెప్పి వెళ్లిపోయాడు.
వీళ్ల మాటలను రహస్యంగా ఇంట్లో కూర్చొని కంప్యూటర్ ద్వారా గర్ల్ ఫ్రెండ్ విన్నది. అతను తన ఫోన్ నెంబర్ ఆమెకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయింది. అయితే తన ప్రేమకు బ్రేకప్ చెప్పే ఉద్దేశం లేదని పేర్కొంది. విషయం తెలిసిన అతడు ఆమెను నిలదీశాడు. బ్రేకప్ చెప్పేందుకు సిద్ధమయ్యాడు. అతను మాత్రం తన మనసు ముక్కలయిందని పేర్కొనడం కొసమెరుపు.












Click it and Unblock the Notifications