సెక్స్ టైంలో మహిళ గట్టి అరుపులు, పక్కింటి వాళ్ల ఫిర్యాదుతో జైలుకు
లండన్: బర్మింగ్ హామ్‌లోని సిటీ సివిల్ న్యాయస్థానం 23 ఏళ్ల ఓ మహిళకు రెండు వారాల జైలు శిక్షను విధించింది. ఆమెకు శిక్ష వేయడానికి ఓ వింతైన కారణం ఉంది. జైలు శిక్ష పడిన మహిళ పేరు జెమ్మా వేల్.
ఆమె శృంగారం సమయంలో ఉదయం ఐదు గంటలప్పుడు ఎక్కువగా అరుస్తోందట. శృంగారం సమయంలో ఆమె అరుపులు ఆమె ఇంటి పక్కన ఉన్న మిగతా వాళ్లకు ఇబ్బందికరంగా మారాయి. బర్మింగ్ హామ్‌లోని స్మాల్ హెత్‌లో గల తన ఇంటిలో ఆమె శృంగార అరుపులు పక్కవాళ్లు భరించలేకపోయారు.

దీంతో వారు న్యాయస్థానానికి వెళ్లారు. ఈమె పైన 40 ఏళ్ల గజాలా బాబీ అనే వారు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆమె ఫిర్యాదును స్వీకరించింది. ఆమె ఇంటి నుండి భరించలేని ధ్వనులు వస్తున్నాయని పేర్కొంది. దీంతో ఆమెకు న్యాయస్థానం రెండు వారాల జైలు శిక్షను విధించింది.












Click it and Unblock the Notifications