ట్విస్ట్: భర్తకు బదిలీ, రెండో పెళ్ళి చేసుకొన్నభార్య, ఫోన్‌తో ఇలా..
జెడ్డా: భర్తకు విడాకులు ఇవ్వకుండానే ఓ వివాహిత మరో వ్యక్తిని వివాహం చేసుకొంది. అయితే రెండో వివాహం చేసుకొన్న వ్యక్తికి కూడ ఈ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టారు. సౌదీలో నియమాలకు విరుద్దంగా వివాహం జరిపించిన వివాహిత తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విధి నిర్వహణలో మరో చోటికి బదిలీ కావడంతో భార్యను తీసుకెళ్ళకపోవడంతో భార్యకు మరో వ్యక్తితో వివాహం చేశాడు ఆమె తండ్రి.
సౌదీలో ఇతర ప్రాంతాల్లో మాదిరిగా చట్టాలుండవు. ఇక్కడ చట్టాలు భిన్నంగా ఉంటాయి. వివాహనికి సంరక్షుడుగా వ్యవహరిస్తున్న వ్యక్తి అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. సంరక్షకుడిగా తండ్రి లేకపోతే ఆ స్థానంలో ఉన్నవారి అనుమతి తీసుకోవాల్సిందే.
అయితే ఈ చట్టాలను ఉల్లంఘిస్తే మాత్రం కఠినంగా శిక్షలు విధిస్తారు.ఈ శిక్షలను అంతే స్థాయిలో అమలు చేస్తారు. అందుకే ఇక్కడ చట్టాలను ఉల్లంఘించాలంటే సాహసం చేయాల్సిందే.

భర్తకు వేరే ప్రాంతానికి బదిలీ
ఓ జంట జెడ్డాలో నివాసం ఉంటుంది. అయితే భర్తకు అనుకోని కారణాల వల్ల వేరే చోటికి ఉద్యోగం ట్రాన్ఫర్ అయింది. భార్యను తనతోపాటు తీసుకుని వెళ్లే వీలు లేకపోవడంతో ఆమెను పుట్టింటికి పంపాడు. అయితే తాను పనిచేసే చోటుకు భార్యను తీసుకెళ్ళే అనుకూల పరిస్థితులు అప్పటికప్పుడే లేకపోవడంతో భర్త ఈ నిర్ణయం తీసుకొన్నారు.తాను పనిచేసే చోటుకు వెళ్ళే సమయంలో భార్యను పుట్టింట్లో దించి మరీ వెళ్ళాడు.

కూతురుకు మరో పెళ్ళి చేసిన తండ్రి
ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతానికి అల్లుడు వెళ్ళాడు. కూతురును పుట్టింట్లో వదిలివెళ్ళాడు. దీంతో కూతురికి మరో వివాహం చేశాడు తండ్రి.అయితే తన కూతురికి మొదట మరో వ్యక్తితో వివాహమైన విషయాన్ని దాచి పెట్టాడు.ఆమెను ఇచ్చి పెళ్ళి చేశాడు. రెండో వ్యక్తితో ఆయన కూతురుకు కాపురానికి కూడ సిద్దమైంది.

మొదట భర్తకు పోన్
మొదట భర్తకు ఓ వ్యక్తి ఫోన్ చేశారు. నీ భార్య మరో వ్యక్తిని వివాహం చేసుకొందనే విషయాన్ని సమాచారాన్ని ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని రూఢీ చేసుకొనేందుకుగాను మొదటి భర్త హుటాహుటిన తన భార్య పుట్టింటికి వెళ్ళాడు. అయితే మరో వ్యక్తితో తన భార్య వివాహం చేసుకొన్న విషయాన్ని గుర్తించాడు. దీంతో మొదటి భర్త ఈ విషయాన్ని రెండో భర్తకు చెప్పాడు.తన మొదటి భార్యను వివాహం చేసుకొన్నట్టుగా తేల్చి చెప్పారు.

ఇద్దరు భర్తల ఫిర్యాదు
అయితే ఒకే మహిళ ఇద్దరు పురుషులను వివాహం చేసుకొంది. ఈ ఘటనపై ఇద్దరు భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేశారు. ఈ విచారణ ఆధారంగా వివాహిత తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.మొదటి పెళ్ళి అంటూ వివాహితను రెండో వ్యక్తికి కట్టబెట్టాడు తండ్రి.












Click it and Unblock the Notifications