నా బాయ్‌ఫ్రెండ్‌ని ఫ్రీగా ఇచ్చేస్తా: ఫేస్‌బుక్‌లో యువతి
లండన్: తన బాయ్ ఫ్రెండ్ చీటింగ్ చేయడాన్ని భరించలేక ఓ యువతి అతనిని ఏకంగా సామాజిక అనుసంధాన వేదికలోనే అమ్మకానికి పెట్టిన సంఘటన యూకేలో చోటు చేసుకుంది. ప్రేమికులు ఒకరి పైన మరొకరికి విసుగు వచ్చినప్పుడు గొడవ పడతారు లేదా బాధపడతారు.
మరీ విసుగు కలిగితే అతనితో లేదా ఆమెతో విడిపోయేందుకే మొగ్గు చూపుతారు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి మాత్రం అతనితో విసిగిపోయి అమ్మకానికి పెట్టడం గమనార్హం. అంతేకాదు, అతనిని ఉచితంగానే ఇస్తానని అమ్మకానికి పెట్టింది.

బ్రిస్టల్ నగరానికి చెందిన యువతి కొరిన్నె స్లేడ్‌కి తన బాయ్‌ఫ్రెండ్ ప్రవర్తన అసలు నచ్చలేదు. తనతో సరదాగా కాసేపు మాట్లాడదామన్నా. గడుపుదామనుకున్నా ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు. అయితే, ఈమె నిద్రపోతున్న సమయంలో మాత్రం వేరే అమ్మాయిలకు చాటింగ్ చేస్తుంటాడు.
అయిదేళ్లుగా ఇదే తీరు. దీంతో ఆమె విసిగిపోయింది. అతను కునుకు తీస్తున్నప్పుడు తీసిన ఫొటోను తీసింది. దానిని ఫేస్‌బుక్‌లో పోస్టడ్ చేసి.. ఉచితంగా నా బాయ్‌ఫ్రెండ్‌ని ఇచ్చేస్తాను, దయచేసి ఎవరైనా తీసుకెళ్లండని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. సోమవారం చేసిన ఈ పోస్ట్ ఫేస్‌బుక్‌లో వైరల్ అయ్యింది.












Click it and Unblock the Notifications