సెల్ఫీ తీసుకుంటూ గన్ ట్రిగ్గర్ నొక్కేసిన మహిళ

మాస్కో: గన్‌తో సోషల్ మీడియాలో ఫొటోగ్రాఫ్‌ను పెట్టుకోవాలని గన్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన రష్యా మహిళ తన ప్రాణాల మీదికి తెచ్చుకుంది. కణతకు తుపాకీ గురిపెట్టుకొని మొబైల్ ఫోన్‌లో సెల్ఫీ తీసుకోవాలని ఆ మహిళ ప్రయత్నం చేసింది. అయితే అది ఆ మహిళను ప్రాణాపాయంలోకి నెట్టింది.

రష్యా రాజధాని మాస్కోలోని తన కార్యాలయంలో సెక్యూరిటీ గార్డులు వదిలివెళ్లిన 9ఎంఎం తుపాకీని తలకు పెట్టుకొని ఫొటోకు పోజుస్తుండగా ఆకస్మాత్తుగా తుపాకీ పేలడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తలకు అత్యంత సమీపంలో తుపాకీని పెట్టుకొన్న యువతి అనుకోకుండా ట్రిగ్గర్‌ను నొక్కడంతో బుల్లెట్ కణతలోకి దూసుకెళ్లిందని, అత్యంత విషమ పరిస్థితిలో ఉన్న మహిళను గురువారం హాస్పిటల్‌కు తీసుకువచ్చారని మాస్కో క్లినిక్ అధికార ప్రతినిధి తెలిపారు.

Woman reportedly shoots self in head while taking selfie

తుపాకీని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లిన పాపానికి దాని యజమాని ఆరు నెలలపాటు కటకటాలను లెక్కించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆఫీస్‌లో భద్రంగా ఉండాల్సిన తుపాకీ మహిళకు ఎలా చేరిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్లో సెల్ఫీ ఫొటోలను పోస్ట్ చేయాలన్న సరదా ప్రమాదాలకు దారితీస్తుండటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గన్‌మ్యాన్‌ సెలవుపై వెళ్తూ గన్‌ను యువతి ఆఫీసులోనే భద్రంగా పెట్టి వెళ్లాడు. అదే ఆ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది. సెల్ఫీ సరదాతో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల చాలా చోటు చేసుకుంటున్నాయి. శనివారం సింగపూర్‌లో అస్లాం షాహుల్‌ అనే కుర్రాడు కొండ అంచునుంచి సెల్ఫీ కోసం ప్రయత్నించి కాలుజారి ప్రాణాలు కోల్పోయాడు. రష్యాలో ఇటీవలే ఓ పాప సెల్ఫీ మానియాలో ఐదో అంతస్తు నుంచి కిందపడి చనిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+