సూట్ కేస్ లో మహిళ మృతదేహం
భారత సంతతికి చెందిన ఓ మహిళ యూకేలోని లీసెస్టర్ లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆమె మృతదేహం సూట్ కేస్ లో లభ్యమైంది.
లండన్: భారత సంతతికి చెందిన ఓ మహిళ యూకేలోని లీసెస్టర్ షైర్ లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆమె మృతదేహం సూట్ కేస్ లో లభ్యమైంది. క్రోమర్ స్ట్రీట్ లో పడిఉన్న సూట్ కేస్ లో మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మృతురాలిని కిరణ్ దౌడియా(46)గా గుర్తించారు. ఆమె భర్త అశ్విన్ దౌడియా(50)ను అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడే ఆమెను హత్య చేసి ఉంటాడనే అనుమానంతో కేసు నమోదు చేశారు.

కిరణ్ దౌడియా గత 17 ఏళ్లుగా కాల్ సెంటర్ లో పని చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కిరణ్ మృతితో వారి కుటుంబం షాక్ కు గురైంది. పోలీసులు సూట్ కేస్ లభించిన వీధిలో సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.
ఆమె హత్యకు దారితీసిన కారణాలు, ఇతర ఆధారాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు. కిరణ్ ఎలా మరణించిందో పోస్టుమార్టం నివేదిక ద్వారా తెలుసుకుని దాని ఆధారంగా దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications