పెళ్లి కాకుండానే తల్లి అయిన మహిళ.. 100 కొరడా దెబ్బలు శిక్ష విధించిన కోర్టు.. ఎక్కడంటే..?

సౌదీ అరేబియాలో రూల్స్, నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో మనకు తెలిసిందే. ఆ దేశంలో న్యాయ వ్యవస్థ పూర్తిగా ఇస్లామిక్ షరియా చట్టాలకు లోబడి ఉంటుంది. మన దేశంలో సాధారణంగా ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తుంటారు. కానీ సౌదీ అరేబియాలో బహిరంగ ప్రదేశాల్లో సరిగ్గా ప్రవర్తించకపోయినా కఠినంగా శిక్షలు వేస్తారు. ఇక మద్యం, డ్రగ్స్ అక్కడ పూర్తిగా నిషేధం. ఇలాంటి కఠిన చట్టాల కారణంగానే సౌదీ అరేబియాలో క్రైమ్ రేట్ మిగతా దేశాలతో పోల్చితే తక్కువగా ఉంటుంది. అలాగే మహిళలపైనా అనేక ఆంక్షలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక సౌదీ అరేబియాకు ఉపాధి, ఉద్యోగం కోసం ప్రపంచ దేశాల నుంచి వేలాది మంది వెళ్తుంటారు.

అయితే తాజాగా సౌదీ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఉపాధి కోసం కెన్యా నుంచి సౌదీ అరేబియాకు వచ్చిన ఓ మహిళ పెళ్లి కాకుండా బిడ్డను కనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు గాను ఆ మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష వేస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. సౌదీ అరేబియాలో ఇల్లీగల్ ప్రెగ్నెన్సీ ను తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి నేరాలకు అక్కడ మహిళలకు జైలు శిక్ష విధించిన సందర్భాలూ ఉన్నాయి. ఇక సౌదీ కోర్టు తాజాగా విధించిన శిక్ష ఆ కెన్యా మహిళను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. బిడ్డ పుట్టాక ఆమె తిరిగి కెన్యాకు వెళ్లాలని ప్రయత్నాలు చేసినా సౌదీ ప్రభుత్వం ఆమెను అడ్డుకున్నట్లు స్పష్టం అవుతోంది.

ఇక ఉపాధి కోసం కెన్యా నుంచి వచ్చిన వేల మంది మహిళల్లో ఎస్తర్ వంజా ముతోని ఒకరు. ఆమె సౌదీలోని ధనవంతుల ఇళ్లల్లో పని మనిషిగా చేస్తుంది. ఆమెకు సంవత్సర కొడుకు అబుదీ ఉన్నాడు. ఇక సౌదీలో ఇలా పనిలో చేరిన వందలాది మంది కెన్యా మహిళలపై అత్యాచారాలు, వేధింపులు మర్డర్ లు జరిగినట్లు న్యూ యార్క్ టైమ్స్ ఇన్వెస్టిగేషన్ గతంలోనే వెల్లడించింది. మరోవైపు వివాహం కాకుండా బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సౌదీ అరేబియా నిరాకరిస్తోంది. అంతేకాక అలాంటి వారికి సహకరించాల్సిన సౌదీ లోని కెన్యా దౌత్యవేత్తలు రివర్స్ లో వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం.

woman Saudi Arabia who gave birth to a child out of wedlock 100 lashes Court shocking verdict in

మరోవైపు తాజాగా తనకు విధించిన శిక్షపై ఎస్తర్ వంజా ముతోని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు భయంగా ఉందని.. తాను ఆ కొరడా దెబ్బలను తట్టుకుంటానా..? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముతోనీ.. ఈజిప్ట్ దేశీయుడితో ఏర్పడిన పరిచయం ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఆమె గతేడాది ఆగస్టులో బాబుకు జన్మ నిచ్చింది. అయితే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ముతోనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రెగ్నెన్సీపై ప్రశ్నలు కురిపించారు. ఈ క్రమంలో తన భర్త పేరు మహమ్మద్ అని ఆయన దేశాన్ని విడిచి వెళ్లిపోయారని పేర్కొంది. ఇక అప్పటి నుంచి పోలీసుల అదుపులో ఉన్న ముతోనీ.. ఇప్పటికే చాలా సార్లు కోర్టులో హాజరయ్యారు. ఈ కేసుపై సుదీర్ఘంగా దర్యాప్తు చేపట్టిన కోర్టు ఆమెకు 100 కొరడా దెబ్బలు శిక్ష విధించింది. మరి ఆ శిక్షను ఎప్పుడు అమలు పరుస్తుందో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+