వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా సూసైడ్ బాంబర్ హమీద్ భార్యనే

By Pratap
|
Google Oneindia TeluguNews

పారిస్: ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని సెయింట్ డెనిస్‌లో ఆ దేశ కమెండో ఆపరేషన్ సమయంలో తనను తాను పేల్చి వేసుకున్న సూసైడ్ బాంబర్‌ను గుర్తించారు. పారిస్ దాడుల ప్రధాన సూత్రధారి అబ్దుల్ హమీద్ భార్యయే సుసైడ్ బాంబర్‌గా మారి తనను తాను పేల్చివేసుకుందని తేల్చారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ధృవీకరించింది.

అటు అరెస్ట్ చేసిన మొత్తం ఏడుగురిలో ఎవరెవరు ఉన్నారనేది ఫ్రాన్స్ ఇంకా వెల్లడించలేదు. ప్యారిస్ లో గత శుక్రవారం జరిగిన ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి అయిన అబ్దెల్ హమీద్ అబోద్ ను హతమార్చామని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. అబ్దెల్ హమీద్ తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు హత్యమైనట్లు చెప్పింది.

Woman suicide bomber is wife of Abdel hamid

అయితే ఒక ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకుని విచారణ చేస్తున్నామని తెలిపింది. ఉత్తర ప్యారిస్ లోని సెయింట్ డెన్నిస్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఉగ్రవాదులు తల దాచుకున్నారని ఫ్రాన్స్ ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. బుధవారం వేకువ జామున ప్యారిస్ పోలీసులు ఆ పార్ట్ మెంట్ ను చుట్టుముట్టారు.

ముందుగా పై అధికారులు ఇచ్చిన సూచనల మేరకు పోలీసులు ఒకే సారి అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. అయితే ఉగ్రవాదులు విరుచుకుపడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ముగ్గురు ఉగ్రవాదులను అపార్ట్ మెంట్ లోనే అంతం చేశారు. ఒకరిని ప్రాణాలతో పట్టుకున్నారు.

English summary
It is said that the woman suicide bomber is Hamid's wife. A judicial source said a second person had died in the pre-dawn raid, but there was no immediate official confirmation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X