వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హట్సాప్:వెంటాడి వేధింపులకు పాల్పడిన యువకులకు బుద్దిచెప్పిందిలా, నెటిజన్లు ఇలా..

వేధింపులకు గురిచేసిన యువకులకు ఓ యువతి తగిన బుద్ది చెప్పింది. కారును వెంటాడి మరీ వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇలా చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించింది.ఈ ఘటన మొత్తం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్:ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకులకు ఆ యువతి బుద్దిచెప్పింది. కారులో వెళ్తున్న యువకులను సైకిల్ పై వెంటాడి మరీ ఆ యువతి బుద్దిచెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

లండన్ లో ఓ యువతి సైకిల్ పై వెళ్తుండగా కారులో వెళ్లున్న యువకులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

అయితే అదే సమయంలో అదే దారి గుండా వెళ్తోన్న యువకుడు ఈ ఘటనను తన కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

cyclist

సైకిల్ పై వెళ్తోన్న యువతిని కారులో వెళ్తోన్న యువకులు కామెంట్ చేశారు.అయితే ఆ యువతి ఇవేమీ పట్టించుకోలేదు.ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆగింది.ఆ యువతి కూడ సిగ్నల్ పడిందని అక్కడే ఆగింది.

అయితే యువతి పట్ల కారులోని యువకులు అసభ్యంగా ప్రవర్తించారు.అంతేకాదు ఆమె పట్ల అసభ్యంగా తాకే ప్రయత్నం చేశారు. మా ఫోన్ నెంబర్లు తీసుకో...నీ పోన్ నెంబర్ ఇవ్వంటూ అసభ్యంగా మాట్లాడారు.

అయితే ఆ యువతి మాత్రం యువకులకు బుద్దిచెప్పాలని భావించింది.కారును వెంబడించింది.కారు ఆగిన చోటకు వెళ్ళి కారు సైడ్ మిర్రర్ ను విరిచిపారేసింది.

అసభ్యంగా ప్రవర్తిస్తే జాగ్రత్త అంటూ యువకులకు వార్నింగ్ ఇచ్చింది. తగిన బుద్ది చెబుతానని ఆ యువతి హెచ్చరించింది.ఈ ఘటనతో ఆ యువకులు షాక్ కు గురయ్యారు.

అయితే ఈ తతంగాన్ని అంతా బైక్ రైడింగ్ వెళ్తున్న ఓ యువకుడు గమనించాడు. ఈ ఘటనను ఆయన రికార్డు చేశాడు. యువతి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.

వెంటనే ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. యువతి చేసిన ధైర్యాన్ని పలువురు మెచ్చుకొంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

English summary
A female cyclist meted out the ultimate revenge on a bunch of men in a van after relentlessly being catcalled by them. A video, steadily going viral all over social media, shows the woman chasing after the van and teaching the men a lesson they'll most likely never forget. The video was reportedly recorded in London on a GoPro camera attached to a biker's helmet. It shows the unidentified woman chasing after the van and ripping off its wing mirror to carry out her revenge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X