భర్త ప్రేయసిని లాక్కొచ్చి బ్రిడ్జిపై నుంచి తోసింది (వీడియో)
రియో డి జానిరో: సోషల్ మీడియాలో నెటిజన్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. భర్త ప్రేయసిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఓ మహిళ పది అడుగుల ఎత్తుగల వంతెనపై నుంచి తోసేసిన వీడియో క్షణాల్లో వైరల్ అయింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై పట్టపగలు ఆమె దాడి చేసి హింసించిన సంఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది.
తన భర్తతో సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ మహిళపై పదే పదే దాడి చేసింది. జట్టుపట్టి లాగి పిడిగుద్దులు కురిపించింది. క్షమించాలని వేడుకున్నా వినలేదు. బాధిత మహిళ గేటు పట్టుకుని పెనుగులాడి వదిలేయాలని కోరింది.
అయినా ఆమె ఆగ్రహం ఆగలేదు. ఈలోగా ఆమెకు మరో మహిళ తోడైంది. ఇద్దరు కలిసి బలవంతంగా జట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చి పది అడుగుల ఎత్తు ఉన్న వంతెనపై నుంచి ఆమెను తోసేశారు. ఆ తర్వాత ఆమె నీళ్లలో లేచి నిలబడిన దృశ్యాలు కూడా రికార్డయ్యాయి.
అయితే, బాధిత మహిళ క్షేమ సమాచారం మాత్రం తెలియలేదు. ఈ సంఘటనను మొత్తాన్ని వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేశాడు. బాధిత మహిళ పోర్చుగీసు భాషలో ప్రాధేయపడుతున్నట్లు, భర్త ప్రేయసిపై మహిళ దాడి చేసిందని ఆయన వీడియోను పోస్టు చేసిన వ్యక్తి చెప్పాడు. ఈ వీడియో నిడివి దాదాపు 30 సెకన్లు ఉంది.












Click it and Unblock the Notifications