స్నానానికి వెళ్లిందా ఆ యువతి.. స్విమ్మింగ్ పూల్‌లో అలికిడి.. దూకడానికి ముందుచూస్తే షాక్ ..?

ఫ్లోరిడా : మీకు ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉందా ? జాగ్రత్త. ఇంటి పైన ఉంటే అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఉండండి. ఔను స్విమ్మింగ్ పూల్‌లో ఏ అర్ధరాత్రి ఆపరాత్రి క్రూర జంతువులు ప్రత్యక్షం కావచ్చు. విష సర్పాలు, మొసళ్లు కూడా దర్శనం ఇవ్వచ్చు. ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ పూల్ ఓకే .. కానీ వాటిలో సరదాగా గడిపేందుకు మొసళ్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓ ఇంట్లో కూడా అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. దీంతో ఆ మహిళ తీవ్ర భయాందోళనకు గురైంది.

ప్లోరిడాలో మిస్ కెర్రీ కిబే నివసిస్తోంది. ఆమెకు విశాలమైన ఇల్లు ఉంది. ఇంటిపైన స్మిమ్మింగ్ పూల్ కూడా ఉంది. అదే ఆమెను ఆందోళనకు గురిచేసింది. గత శనివారం తెల్లవారుజామున పైన అలికిడి వినిపించింది. ఏం జరిగిందని పైకి వెళ్లి చూసింది. మసక మసక చీకటి ఉండటంతో లైట్ వేసింది. అంతే గుండె ఆగినంత పనైంది ఆమెకు స్విమ్మింట్ పూల్‌లో మొసలి జాలకాటలాడుతూ కనిపించింది. నోట మాట రాలేదు. 7 ఫీట్లు ఉన్న మొసలిని చూసి గజ గజ వణికిపోయింది. తర్వాత తేరుకొని ఆ మొసలి ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

Woman Wakes Up To Find 7-Foot Alligator In Her Swimming Pool

మొసలీని చూసిన వెంటనే వణికిపోయిన కెర్రీ .. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారికి ఫోన్‌లో జరిగిన ఘటనను వివరించారు. దీంతో వారు మొసలిని పట్టుకునే వారిని పిలిపించారు. 7 అడుగులు ఉన్న మొసలి వయస్సు 15 ఏళ్లు ఉంటుందని మొసలి పట్టే వ్యక్తి చెప్పారు. దానిని తీసుకొని శివారు గ్రామంలో గల చెరువులో వదిలేశారు. అయితే ఫ్లోరిడా నడిబొడ్డున మొసళ్లు రావడం ఏంటని కెర్రీ ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ నడిబొడ్డున మొసలి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. కానీ నగరంలో తోడేళ్లు, చిరుత పులులు, పాములు, మొసళ్లు కనిపించడం ఏంటని ప్రశ్నించారు. ఫ్లోరిడాలో మొసలి కనిపించడం ఇదే తొలిసారి కాదు.. గతేడాది ఒర్లాండోలో ఒకతను తన స్విమ్మింగ్ పూల్‌లో ఆరగడులు మొసలిని కనుగొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+