బాయ్‌ప్రెండ్‌తో సెక్స్: అనుకోకుండా కండోమ్ మింగేసింది

కడుపులో నొప్పిగా ఉందని ఆసుపత్రికి వచ్చిన ఓ యువతి పొట్టలో కండోమ్‌ను గుర్తించిన డాక్టర్లు ఖంగుతిన్నారు. కామెరూన్‌లోని ఓ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో యువతి అపెండిక్స్‌లో ఉన్న కండోమ్‌ను ఆపరేషన్ చేసి వైద్యులు తొలగించారు.

వివరాల్లోకి వెళితే... 26 ఏళ్ల యువతి తన నడుము కుడి వైపున నొప్పి వస్తుందని, తినడానికి వీలు పడకపోవడంతో పాటు విపరీతమైన కడుపు నొప్పి వచ్చి, జ్వరంతో బాధపడుతున్నానని కామెరూన్‌లోని ఓ ఆసుపత్రికి వచ్చింది. దీంతో ఆమె శరీరాన్ని స్కాన్ చేసి, రిపోర్టును పరిశీలించిన వైద్యులు ఆమెకు అపెండిక్స్ ఉబ్బి ఉండటాన్ని గమనించారు.

Woman was found to have a CONDOM stuck inside her appendix

వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు అపెండిక్స్‌ను తొలగించే క్రమంలో అక్కడ ఉన్న రబ్బర్ లాంటి పదార్ధాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. ఆ రబ్బరుని పరీక్షించి చూసిన వైద్యులు చివరికి దానిని కండోమ్‌గా తేల్చారు. ఈ ఆపరేషన్‌ను మెడికల్ కేసు రిపోర్టులలో జర్నల్‌గా వైద్యులు అభివర్ణించారు.

రెండు వారాల క్రితం తన బాయ్‌ప్రెండ్‌తో కలిసి శృంగారం చేసే సందర్భంలో గొడవ పడుతూ ప్రమాదవశాత్తూ కండోమ్‌ను మింగినట్లు ఆ యువతి వెల్లడించిందని వైద్యులు తెలిపారు. కండోమ్ మింగిన తర్వాత ఆమె గత ఐదు రోజులుగా ఎటువంటి మెడికల్ సాయం తీసుకోకపోవడంతో కడుపునొప్పి తీవ్రమైనట్లు తెలిపారు.

కండోమ్‌ను ఆమె నోటి ద్వారా తీసుకోవడం వల్లనే అది అపెండిక్స్ వరకూ వచ్చి అడ్డుపడిందని వైద్యలు తెలిపారు. గతంలో అపెండిక్స్‌లో బుల్లెట్లు, స్కూలు, నాణెలు, రాళ్లు, పిన్నులు, సూదులు, పళ్లు, ఎముకలు లాంటి వాటిని ఆపరేషన్ చేసి బయటకు తీసినప్పటికీ, కండోమ్‌ను తొలిసారిగా ఆపరేషన్ ద్వారా తొలగించడమే చాలా అశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+