అరాచకం: కొడుకుతో రేప్, తలనరికి రక్తాన్ని.., స్నానానికి, శృంగారానికి వాళ్లు దూరం!

Subscribe to Oneindia Telugu

కాంగో: కాంగో ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న అక్కడి రెబల్స్ అత్యంత హింసాత్మక మార్గాలను అనుసరిస్తున్నారు. తాజాగా ఓ మహిళను అత్యంత దారుణంగా అందరూ చూస్తుండగానే తలనరికి హత్య చేశారు. ఆపై ఆమె రక్తం తాగారు.

అంతకుముందు కొడుకుతో(భర్త రెండో భార్య తనయుడు) ఆమెను రేప్ చేయించారు. మృతురాలు స్థానికంగా ఓ రెస్టారెంట్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కమినా ఎన్‌సపూ రెబల్స్‌ ఆ రెస్టారెంటుకు వెళ్లగా విషపూరితమైన చేపల ఆహారాన్ని వారికి పెట్టినట్లు చెబుతున్నారు.

 రెబల్స్ నాయకుడి ఆదేశం:

రెబల్స్ నాయకుడి ఆదేశం:

ఆమె పెట్టిన విషాహారం తిని నలుగురు రెబల్స్ చనిపోయారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన రెబల్స్ నాయకుడు కబాటా.. సదరు మహిళను, ఆమెకు సహకరించిన వ్యక్తి తల నరికి ఊరి నడిబొడ్డున వేలాడదీయాలని ఆదేశించాడు. కబాటా ఆదేశం మేరకు ఇద్దరినీ ఈడ్చుకొచ్చిన రెబల్స్‌.. వారిని క్రూరంగా హింసించి హత్య చేశారు.

తిరుగుబాటు ఎందుకు?

తిరుగుబాటు ఎందుకు?

కాంగో గిరిజన తెగ నాయకుడు కమినా ఎన్ సపూను అగస్టు 2016లొ అక్కడి ఆర్మీ చంపడంతో ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. ఆ తెగకు చెందిన గిరిజనులంతా అధ్యక్షుడు జోసెఫ్ కబిలా పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

 సైన్యం అదుపులోకి ల్యూబో:

సైన్యం అదుపులోకి ల్యూబో:

ఈ ఏడాది మార్చిలో కమినా ఎన్‌సపూ రెబల్స్‌ ల్యూబో పట్టణాన్ని తమ అదుపాజ్ఞాల్లోకి తెచ్చుకున్నారు. అయితే కాంగోలీస్‌ ఆర్మీ తిరిగి 20 రోజుల్లోనే పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకొచ్చింది. ఈలోపే మహిళ తలనరికి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. సైన్యం పట్టణాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకునే రోజున నడివీధిలో వేలాడుతున్న ఇద్దరి శవాలు దర్శనమివ్వడం గమనార్హం.

 రెబల్స్ గురించి తెలియనివి!:

రెబల్స్ గురించి తెలియనివి!:

తిరుగుబాటు మొదలైన నాటి నుంచి కాంగో కమినా ఎన్‌సపూ రెబల్స్.. శృంగారంలో పాల్గొనకపోవడం, స్నానం చేయకపోవడం, మాంసం తినకపోవడం వంటి నిబంధనలను పాటిస్తున్నారని వారిపై పరిశోధన చేస్తున్న ఓ ప్రొఫెసర్ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman in the Democratic Republic of Congo was publicly raped, whipped and decapitated in front of a cheering crowd after serving 'forbidden fish' to a group of anti-government rebels, who later drank her blood.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి