ఆ మహిళ కారు డిక్కీ తెరవగానే ఇంజిన్ పక్కన 4 అడుగుల పైథాన్
విస్కోన్సిన్: అమెరికాలోని విస్కోన్సిన్‌లో ఓ మహిళ కారులో పైథాన్ కనిపించింది. కారు ముందు డిక్కీలోని ఇంజిన్ వద్ద అది పడుకొని ఉంది. ఇందుకు సంబంధించి ఓమ్రో పోలీస్ డిపార్టుమెంట్ తన ఫేస్‌బుక్ అధికారిక పేజీలో ఓ పోస్ట్ చేసింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఓ మహిళకు చెందిన ఎస్‌యూవీ కారు ఎప్పటికి భిన్నంగా ముందుకు సాగుతోంది. దీంతో కారు డ్రైవర్ ఏదైనా సమస్య ఉందేమోనని కారు డిక్కీ తెరిచాడు. అతను డిక్కీ తెరవగానే కారు ఇంజిన్ వద్ద ఓ పెద్ద పాము కనిపించింది..

వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఓమ్రో నుంచి పీటర్స్ అనే ఆఫీసర్, విన్నేకాన్ నుంచి సౌరియోల్ అనే అధికారి.. ఇద్దరు వచ్చారు. వారు అందులోని పామును తీసే ప్రయత్నం చేశారు. వారు దానిని పైథాన్‌గా గుర్తించారు. కారు ఇంజిన్ ప్రాంతం నుంచి ఆ పైథాన్ తొలగించడంలో ఇద్దరు అధికారులు విఫలమయ్యారు. దీంతో పాములు పట్టేవారిని రప్పించారు.
ఈ ఫోటోను ఓమ్రో పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దీనిని 2300 మందికి పైగా షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
కాగా, ఈ పైథాన్ 4 అడుగుల పొడువు ఉంది. దీనిని పాములు పట్టే స్టీవ్ కెల్లర్ అక్కడి నుంచి కాపాడాడు. దీనిని పెట్ స్నేక్‌గా భావిస్తున్నారు. యజమాని నుంచి తప్పించుకొని ఉంటుందని భావిస్తున్నారు. ఓమ్రోలో ఎక్సోటిక్ పెట్స్ పెంపకం చట్టవిరుద్ధం. కాగా ఇలా పాము దొరకడం ఇదే మొదటిసారి కాదు. గతంలోను జరిగింది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications