పొట్టి దుస్తుల అమ్మాయిలు! రేపర్ తీసిన చాక్లెట్లు: థాయ్ పీఎం
బ్యాంకాక్: థాయ్ లాండ్ ప్రధాని ప్రయూత్ చానోచా యువతుల వస్త్రధారణపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అంగసౌష్టవం బయటకు కనిపించేలా కురచ, బిగుతైన దుస్తులు ధరించవద్దని సలహాయిచ్చారు.
కాగా, మహిళల వస్త్ర ధారణపై ప్రధాని చానోచా చేసిన వ్యాఖ్యలు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. శరీర అవయవాలు బయటకు కనిపించేలా పొట్టి, బిగుతు దుస్తులను యువతులు ధరించరాదని అన్నారు.
పొట్టి దుస్తుల్లో కనిపించే వారు రేపర్ తీసిన చాక్లెట్ల వంటి వారని, దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా దుస్తులు ధరించాలని కోరారు. రేపర్ చుట్టి ఉంచిన చాక్లెట్, ఇంట్లో ఉంటే పాడుకాదని కూడా ఆయన అన్నారు.

కాగా, థాయ్ లో 'సాంగ్ క్రాన్' పేరిట జరిగే న్యూ ఇయర్ వేడుకల్లో రెయిన్ డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణ. ఈ సమయంలో అసభ్య ప్రవర్తనలు, లైంగిక వేధింపులపై ఫిర్యాదులూ వెల్లువెత్తుతుంటాయి.
కాగా, అనుచితంగా ప్రవర్తించరాదని, దేశ ఆచారాలకు అనుగుణంగా దుస్తులు ధరించాలని థాయ్ లాండ్ సైనిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగితంలో చుట్టివున్న కాండీని ఏళ్ల తరబడి ఇంట్లో ఉంచుకున్న పాడైపోదని ప్రయూత్ చానోచా వ్యాఖ్యానించడం విశేషం. కాగా, ఆడవాళ్ల దుస్తులపై ప్రధాని వ్యాఖ్యలను థాయ్ మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి.












Click it and Unblock the Notifications