అందంగా ఉన్న పురుషులు తప్పు చేసినా ఫర్వాలేదు: సర్వే
న్యూఢిల్లీ: అందంగా, ఆకర్షణీయంగా ఉండే అబ్బాయిలు తప్పులు చేస్తే మహిళలు ఈజీగా క్షమించేస్తారని ఓ సర్వే పేర్కొంది. అమెరికాలోని ఈస్ట్రన్ కెంటకీ యూనివర్సిటీకి చెందిన జెరెమీ గిబ్సన్, జొనాథన్ గోర్ అనే ఇద్దరు యువకులు ఈ సర్వేని నిర్వహించారు.
ఈ సర్వే ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలను వారు తెలియజేశారు. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతడిని క్షమించాలా, వద్దా అనే విషయం వాళ్లు ఎంత అందంగా ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
అందంగా లేని అబ్బాయిలను కొంత వరకు క్షమిస్తారని, అసభ్యంగా ప్రవర్తిస్తే మాత్రం తాట తీస్తారని గిబ్సన్ అన్నారు. ఇందు కోసం గాను మొత్తం 170 కాలేజీలకు చెందిన అమ్మాయిలు, అబ్బాయిల మీద వీరు పరిశోధన చేశామని అన్నారు.

బాగా ఆకర్షణీయంగా ఉండే అబ్బాయిలు, అసలు ఉండని అబ్బాయిల ముఖాలను చూపించి, కొన్ని సందర్భాలను సృష్టించారు. ఈ సందర్భాల్లో అమ్మాయిల రియాక్షన్లు ఎలా ఉన్నాయో గమనించి, ఒక నివేదికను రూపొందించామని తెలిపారు.
అందంగా ఉండే అబ్బాయిలు చేసిన తప్పులను సర్వేలో పాల్గొన్న మహిళలు ఈజీగా క్షమించగా, ఆకర్షణీయంగా లేని అబ్బాయిలు చేసిన తప్పులను మాత్రం వారు క్షమించలేదని పేర్కొన్నారు. న్యాయవ్యవస్ధలో కూడా నేరం చేసి ఆకర్షణీయంగా ఉండే ముద్దాయిలకు తక్కువ శిక్షను విధించగా, ఆకర్షణీయంగా లేని ముద్దాయిలకు మాత్రం తీవ్రమైన జరిమానాలు విధిస్తారని అన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications