ప్రపంచంలోని 500 మంది పవర్‌ఫుల్ ముస్లింల జాబితా.. టాప్‌లో ఆ నలుగురు నేతలు!

ప్రపంచంలోని 500 మంది అత్యంత పవర్‌ఫుల్ ముస్లింల తాజా జాబితాను 'రాయల్ ఇస్లామిక్ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్' విడుదల చేసింది. ఈ జాబితాలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ రక్షణ దళాల అధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. జోర్డాన్‌లోని అమ్మాన్ కేంద్రంగా పనిచేస్తున్న 'రాయల్ ఇస్లామిక్ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్' పరిశోధనా సంస్థ 2009 నుంచి ఏటా ఈ నివేదికను ప్రచురిస్తోంది. ఉన్నత పదవుల్లో ఉండి ప్రభావం చూపే వారితో పాటు ముస్లిం సమాజానికి విశేష సేవలందించిన వారిని ఇందులో ఎంపిక చేస్తారు.

పాకిస్థాన్ 'డ్రోన్ వార్'.. లక్ష టర్కిష్ FPV డ్రోన్ లతో.. భారత్ అలర్ట్.. ఏం జరుగుతోంది..?
పాకిస్థాన్ 'డ్రోన్ వార్'.. లక్ష టర్కిష్ FPV డ్రోన్ లతో.. భారత్ అలర్ట్.. ఏం జరుగుతోంది..?

మక్కా ఒప్పందమే కారణం
ఈ జాబితాలో మొదటి స్థానాన్ని నలుగురు నేతలు పంచుకోవడం ఇదే తొలిసారి. పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాల మధ్య కుదిరిన మక్కా ఉమ్మడి రక్షణ ఒప్పందానికి గుర్తింపుగా వీరిని సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిపారు. ముస్లిం దేశాలు తమ భద్రత కోసం పరస్పరం సహకరించుకుంటున్న తీరుకు ఇది నిదర్శనమని నివేదిక పేర్కొంది. ఈ జాబితాపై పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్, ఎంపీ సమర్ హర్షం వ్యక్తం చేస్తూ ఇది దేశానికి గర్వకారణమని కొనియాడారు.

World 500 Most Powerful Muslims List Released Asim Munir Erdogan Mohammed bin Salman Top Chart

టాప్-15లో ఖమేనీ, హౌతీ
జాబితాలో నాలుగో స్థానంలో ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ, ఐదో స్థానంలో జోర్డాన్ రాజు అబ్దుల్లా-2, ఆరో స్థానంలో ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ నిలిచారు. పాకిస్థాన్‌‌కు చెందిన షేక్ మొహమ్మద్ తకీ ఉస్మానీ 7వ స్థానంలో ఉండగా.. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం(8), మొరాకో రాజు మొహమ్మద్-6(9), ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో(10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. యెమెన్ హౌతీ నేత షేక్ అబ్దుల్ మాలిక్ హౌతీ 11వ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 12వ స్థానం దక్కించుకున్నారు.

2050 నాటికి పాకిస్థాన్ లక్ష్యం ఇదే.. షెహబాజ్ షరీఫ్ సంచలనం
2050 నాటికి పాకిస్థాన్ లక్ష్యం ఇదే.. షెహబాజ్ షరీఫ్ సంచలనం

జాబితాలో సలాహ్, మమ్దానీ
ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసి(22), పాక్ ఇస్లామిక్ పండితుడు మౌలానా తారిఖ్ జమీల్(32), ఫుట్‌బాల్ స్టార్ మొహమ్మద్ సలాహ్(39), పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్(45), సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా(46) ఈ జాబితాలో ఉన్నారు. న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ 49వ స్థానంలో నిలిచారు. వీరితో పాటు హమాస్ చీఫ్ ఖలీల్ అల్-హయ్యా, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, లండన్ మేయర్ సాదిక్ ఖాన్, అమెరికా సెనేటర్ అబ్దుల్ అల్-సయ్యద్ కూడా ఈ 500 మంది జాబితాలో చోటు దక్కించుకున్నారు.

మ్యాన్ అండ్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్
ఏటా 'రాయల్ ఇస్లామిక్ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్' ఎంపిక చేసే 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్' పురస్కారానికి ఈ సారి పాలస్తీనాకు చెందిన పిల్లల వైద్యుడు హుస్సామ్ అబూ సఫియా ఎంపికయ్యారు. తన కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేసిన వెంటనే తరిగి ఆస్పత్రి వార్డులో రోగులకు సేవలందించిన ఆయన.. గత 600 రోజులకు పైగా ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్నారు. ఇక ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా ఇరాన్‌కు చెందిన ఫాతిమెహ్ జహ్రా షేక్ అబాదీ ఎంపికయ్యారు. ఇరాన్‌లోని మినాబ్ బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన అమెరికా దాడిలో 150 మంది మరణించగా.. ఆ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన షేక్ అబాదీ జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో మినాబ్ చిన్నారుల గొంతుకను వినిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+