డీఎన్‌ఏను తిరగరాసి: చైనాలో పుట్టిన తొలి డిజైనర్ బేబీ, శాస్త్రవేత్తల ఆందోళన
బీజింగ్: సాంకేతికతతో దూసుకెళ్తున్న చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే తొలి డిజైన్ బేబీని పుట్టించింది. కోరుకున్న లక్షణాలతో డీఎన్ఏలో మార్పులు చేసి మానవ శిశువును సృష్టించింది. డిజైనర్ బేబీ ప్రయోగంలో పాల్గొన్న సైంటిస్ట్ హె జుయాన్కుయి ఇందుకు సంబంధించి సంచలన ప్రకటన చేసింది.
కోరుకున్న లక్షణాలతో మానవ శిశువులను పుట్టించడం గమనార్హం. ప్రపంచంలోనే తొలిసారి డిజైనర్ బేబీలకు పురుడు పోయడం గమనార్హం. R ఈ ప్రాజెక్టులో దాదాపు 100 మంది సైంటిస్టులు పాలుపంచుకున్నారు. ఇందులో ఎక్కువమంది చైనావారు ఉన్నారు. ఈ ప్రయోగంలో హె జుయాన్కుయి కూడా పాలు పంచుకున్నారు. ఆయన సోమవారం హాంకాంగ్‌లో దీనిపై ప్రకటన చేశారు.

ఇద్దరు ఆడ శిశువులు
అండ దశలో జన్యువులను మార్చి ఇద్దరు కవల ఆడ శిశువులకు జన్మించారని జుయాన్కుయి తెలిపారు. డీఎన్ఏను తిరగరాసి ఈ ప్రయోగం చేశామని చెప్పారు. దీని కోసం దాదాపు ఏడు జంటల అండాల్లో మార్పులు చేశామని తెలిపారు. ఓ అండం ఫలదీకరణం చెందిందని చెప్పారు. అయితే వారసత్వ వ్యాధులను అరికట్టేందుకు ఈ ప్రయోగం చేయలేదని, ఎయిడ్స్ వంటి వ్యాధులు అడ్డుకునే రోగ నిరోధక శక్తి కోసం చేశామన్నారు.

ఎక్కడ జన్మించారో చెప్పలేదు
అయితే ఏ ప్రాంతంలో ఈ డిజైనర్ బేబీలు జన్మించారో ఆయన చెప్పలేదు. మరోవైపు జుయాన్కుయి ప్రకటనపై పలువురు సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ ఆరోగ్య కమిటీ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. డీఎన్ఏను మార్చడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జుయాన్కుయి చెప్పింది నిజమో కాదో కూడా నిర్ధారించాల్సి ఉందని మరికొందరు చెబుతున్నారు.

ఏమిటీ డిజైనర్ బేబీ?
జన్యుపరంగా ఎలాంటి లోపాలు లేని పిల్లలే డిజైనర్ బేబీలు, పుట్టుకతో వచ్చే ఎలాంటి వ్యాధులు లేనివాళ్లు. వీళ్లు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటారట. వీరికి అసాధ్యమైనది ఏదీ ఉండదట. ఏదైనా అనుకుంటే అంతు చూసేదాకా వదలరట. ఇలాంటి దానికి జీనోమ్ ప్రాజెక్టుతో సమాధానం దొరికిందని చెబుతున్నారు. పక్షవాతం, బీపీ లాంటి జబ్బులు కొంతమందికే వస్తాయని, స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ రాదనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే క్రమంలోనే జీనోమా ప్రాజెక్టు పుట్టింది. జన్యుతత్వంతో ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణం ఉంటుంది. అందుకే అందరికీ ఒకే రకమైన వ్యాధులు రావు. మనిషిలోని ఏ జన్యువు ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుందో తెలుసుకోవడమే జీనోమ్ ప్రాజెక్టు లక్ష్యం.

జీన్స్ కారణమని గుర్తించారు
జీనోమ్ డీఎన్ఏ శ్రేమిని శాస్త్రవేత్తలు 2010లో తెలుసుకున్నారు. మనిషి డిఎన్ఏలోని మూడు బిలియన్ల లెటర్ కోడ్‌ను క్రాక్ చేశారు. ఇంతేకాదు అంతేకాదు వ్యాధులకు కారణమయ్యే జీన్స్ గుట్టును రట్టు చేశారు. మన వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను ప్రభావితం చేసే మరికొన్ని జన్యువులను గుర్తించారు. జన్యువుల నిర్మాణమే మనిషిలోని నమ్మకాలు, అలవాట్లకు కారణంగా గుర్తించారు. హోమోసెక్సువాలిటి, తాగుడుకు బానిస, స్థూలకాయానికి.. ఇలా దాదాపు అన్నింటికి జీన్స్ కారణంగా గుర్తించారు.












Click it and Unblock the Notifications