అతిపొడవైన ప్లేన్, బుల్లెట్ తగిలినా ఏం కాదు(పిక్చర్స్)
లండన్: ప్రపంచంలోనే అతి పొడవైన బ్రిటన్ విమానం ది ఎయిర్ లాండర్ 10కు సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి. టెస్ట్ ఫ్లయిట్‌కు సంబంధించిన కొన్ని భాగాలను విమానం, హెలికాప్టర్ నుంచి సేకరించి తయారు చేశారు.
బుల్లెట్లు తగిలినా ఎలాంటి అవరోధం లేకుండా ప్రయాణించడం ఈ విమానం ప్రత్యేకత. దీని పొడవు 92 మీటర్లు, చుట్టుకొలత 15 మీటర్లు, 26 మీటర్ల ఎత్తు, 44 మీటర్ల వెడల్పు ఉంటుంది. యాభై టన్నుల బరువును తేలికగా మోసుకెళ్లగలదు.

నిఘా కార్యక్రమాల కోసం, కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు, అత్యవసర సమయాల్లో సహయకార్యక్రమాలను అందించడంతో పాటు ప్రయాణికుల సేవల కోసం అందుబాటులో ఉండే విధంగా ఈ విమానాన్ని బ్రిటిష్ వైమానిక ఉత్పత్తి సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికిల్ (హెచ్‌ఏవీ) డిజైన్ చేసింది.

హీలియం ఇంధనం సహాయంతో ఆకాశంలో మూడు వారాలు ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. గంటకు 92 మైళ్ల వేగంతో వెళ్లగలదు. నీరు, మంచుతోపాటు ఎలాంటి ఉపరితలం పైన అయినా ఏ సాధనాలు లేకుండా ల్యాండ్ అవగలదట. అమెరికా ప్రభుత్వం కోసం ఈ విమానాన్ని 2009లో తయారు చేయగా, రక్షణశాఖలో నిధులు లేకపోవడంతో దీని నిర్మాణం ఆగిపోయింది.












Click it and Unblock the Notifications