ప్రపంచంలోనే పొడవైన కాళ్లు.. గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు.. 6 అడుగుల పది అంగుళాలు..
మెరికాకు చెందిన యువతి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. అయితే ఆమె ఏదో ఫీట్ చేయలే.. తన కాళ్లతో రికార్డ్ సాధించారు. అవును మీరు చదువుతుంది నిజమే.. ఆమె కాళ్లు ప్రపంచంలోనే అత్యంత పొడవైనవి. దీనిని గిన్నిస్ బుక్ రికార్డ్స్ కూడా ధృవీకరించింది. ఫీమెల్ క్యాటగిరీలో మాసీ కర్రిన్ రికార్డుల్లోకి ఎక్కారు. దీంతోపాటు టీనేజర్ లాంగెస్ట్ లెగ్స్ క్యాటగిరీలో కూడా రికార్డు ఆమె పేరుతో ఉంది.

మీటర్ నర పొడవు..
ఆమె రెండు కాళ్లు మీటర్ నర పొడవు ఉంటాయి. ఎడమ కాలు 135.267 సెంటిమీటర్లు ఉండగా.. కుడి కాలు కాస్త తక్కువగా 134.3 సెంటిమీటర్లు ఉంటుంది. మాసీ కుటుంబం టెక్సాస్‌లోని కెడార్ పార్క్‌లో ఉంటుంది. అయితే మాసీ కుటుంబంలో అందరూ పొడవుగా ఉంటారు. ఆమె తోబుట్టువులు, పేరంట్స్ అయితే ఆమె అంత హైట్ లేరు. మాసీ మాత్రం 6 అడుగుల 10 అంగుళాలు ఉంటుంది. ఈ ఎత్తులో కాళ్లు 60 శాతం ఎత్తు ఉంటాయి.

ప్రయోజనాలు.. బ్యాక్ డ్రాప్స్...
ఎత్తు ఉన్న వారిని ఇన్‌స్పైర్ చేయడానికి తనకు మంచి అవకాశం టైటిల్ అని మాసి చెబుతోంది. అలాగే ఎత్తు ఉన్నవారు ఇబ్బంది పడొద్దని అందుకే తాను తాపత్రాయ పడుతుంటానని తెలిపారు. అయితే ఎత్తు ఉంటే ప్రయోజనాలతోపాటు ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ వాటిని అధిగమిస్తున్నానని పేర్కొన్నారు. గుమ్మం గుండా వెళ్లే సమయంలో, కారులో కూర్చొనే సమయంలో ఇబ్బంది పడుతుంటానని పేర్కొన్నారు.

వాలీబాల్ ఆడే సమయంలో
తన పొడవాటి కాళ్లతో గేమ్స్ ఆడే సమయంలో తనకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా స్కూల్‌లో వాలీబాల్ ఆడే సమయంలో తనకు మేలు జరిగిందని తెలిపారు. తన కాళ్లు సాధారణంగా కంటే పెద్దగా ఉన్నాయని 2018లో గుర్తించానని తెలిపారు. అప్పుడు తనకు లెగ్గిన్స్ సరిపోయేవి కావు అని చెప్పారు. తర్వాతే తాను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులను కలిశానని పేర్కొన్నారు.
రికార్డ్ బ్రేక్ చేయండి..
ఎవరైనా పొడవు కాళ్లు ఉంటే ఇబ్బంది పడొద్దని చెప్పారు. తన రికార్డ్‌ను కూడా బ్రేక్ చేయాలని సూచించారు. కానీ ఇప్పుడు ఆమె సోషల్ మీడియా వేదికలో చాలా పాపులర్ అయ్యారు. తన రికార్డు గురించి వీడియోలు చేయడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. అంతేకాదు తాను మోడల్ అవుతానని.. ప్రపంచంలో ఎత్తయిన మోడల్‌గా నిలుస్తానని మాసీ ధీమాతో ఉన్నారు. ఆమె కల సాకారం కావాలని మనం కూడా ఆశిద్దాం.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications