సర్జరీ విఫలం: ప్రపంచంలోనే అతిపెద్ద మనిషి మృతి
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత భారీకాయుడుగా పేరుగాంచిన ఆండ్రెస్ మోరోనో (38) శుక్రవారం మెక్సికోలో మృతి చెందాడు. గుండెనొప్పి కారణంగా చనిపోయినట్టు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. సుమారు 450 కిలోల బరువ ఉంటే ఆండ్రెస్ మోరోనో రెండు నెలల క్రితం బరువు తగ్గడానికి బెరియాట్రిక్ సర్జరీని చేయించుకున్నాడు.
ఈ సర్జరీ ద్వారా సుమారు 100 కిలోల బరువును డాక్టర్లు తగ్గించారని స్థానిక వార్తా ఏజెన్సీ తెలిపింది. సర్జరీలో భాగంగా అహారం మితంగా తీసుకోవడానికి పొట్టలో ట్యూబ్‌ను అమర్చారు. సర్జరీ అనంతరం కొన్నాళ్లు మామూలుగానే జీవించిన ఆండ్రెస్ మోరోనో క్రిస్మస్ రోజున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన అసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. గతంలో మొరేనో పోలీస్ మెన్‌గా పనిచేసిన ఆండ్రెస్ మోరోనో అధిక బరువు కారణంగా గత కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యాడు.
అయితే అధిక బరువుని తగ్గించుకునేందుకు చేయించుకున్న బెరియాట్రిక్ సర్జరీ విఫలం కావడం వలనే మొరేనో మృతి చెందాడనే అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications