112 ఏళ్ల వయస్సులో ప్రపంచ ఓల్డెస్ట్ వ్యక్తి మృతి
టోక్యో: ప్రపంచంలోనే అతిపెద్ద వయస్సు గల వ్యక్తి మృతి చెందాడు. వరల్డ్ ఓల్డెస్ట్ మ్యాన్ అయిన యసుతారో కోయిడ్ (112) మంగళవారం కన్నుమూశాడు. గత కొంతకాలంగా హృదయ సంబంధిత, న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నాడు.
సెంట్రల్ జపాన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోయిడ్ తుదిశ్వాస విడిచారు. వరల్డ్ ఓల్డెస్ట్ మ్యాన్‌గా కోయిడ్ గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కాడు. మరో రెండు నెలలు అయితే కోయిడ్ 113వ జన్మదినాన్ని జరుపుకునే వారు.
ఇతను 1903 మార్చి 13న కోయిడ్ జన్మించాడు. రైట్ సోదరులు అదే సమయంలో తమ మొదటి విమానాన్ని కనుగొన్నారు. దానికి రెండు నెలల ముందు ఇతను జన్మించాడు.












Click it and Unblock the Notifications