ప్రపంచంలోనే టాప్ 5 సురక్షితమైన విమాన సంస్థలు ఏవో తెలుసా..?

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల్లో అన్నింటికన్నా సురక్షితమైనది విమానయాన ప్రయాణం అని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రస్తుత కాలంలో విమాన ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది మరణించారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు.. 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది.

ఈ ఘటన జరిగిన రెండు రోజులకే కేథార్ నాథ్ లో యాత్రికులను తరలించే క్రమంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో విమానం ఎక్కాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమాన సంస్థలు ఏంటో మీకు తెలుసా..?

ఎయిర్ లైన్ రేటింగ్ సంస్థ ఇటీవల విడుదల చేసిన జాబితా ఆధారంగా టాప్ 5 విమాన సంస్థలను ఓసారి పరిశీలిస్తే.. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమాన సంస్థగా ఎయిర్ న్యూజిలాండ్ నిలిచింది. ఈ సంస్థ వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలవడం విశేషం. దీని సగటు వయస్సు 9.5 సంవత్సరాలుగా ఉంది. ఎలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ.. అద్భుతమైన పైలట్ నైపుణ్యం, ఆధునిక సాంకేతికతతో ఈ విమానయాన సంస్థ గుర్తింపు పొందింది.

ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ సంస్థ ఉంది. ఎయిర్ న్యూజిలాండ్‌తో 1.5 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచిందీ సంస్థ. 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. క్వాంటాస్ సంస్థకు అత్యుత్తమ సేఫ్టీ రికార్డ్ ఉంది. గతంలో 2014- 2017మధ్య ఏకంగా నాలుగు సార్లు మొదటి స్థానం సాధించింది.

World s Safest Airlines 2025 Air New Zealand Leads Top 5 Rankings

మూడో స్థానంలో హాంకాంగ్ కు చెందిన క్యాథే పసిఫిక్ సంస్థ ఉంది. 11.6 సంవత్సరాల సగటు ఫ్లీట్ వయస్సు, సేఫ్టీ రికార్డ్ ఈ సంస్థ సొంతంగా చెప్పొచ్చు. నాలుగో స్థానంలో ఖతార్ కు చెందిన కతర్ ఎయిర్‌వేస్ ఉంది. కతర్ ఎయిర్‌వేస్ సేఫ్టీ రికార్డ్ లో ఏళ్లుగా టాప్ ప్లేస్ లో సాగుతోంది. ఇక ఐదో స్థానంలో దుబాయ్ కు చెందిన ఎమిరేట్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిలిచింది. ఇది అత్యుత్తమ సేఫ్టీ రికార్డ్ నెలకొల్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+