ప్రపంచంలోనే డేంజరస్ రేపిస్టు వీడు.. కామదాహానికి 230 మంది బలి.. సెక్స్ వీడియోలతో బ్లాక్ మెయిల్..
క్యూట్ లుక్స్ తో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తున్నాడు కదా.. ఇలాంటి ఫొటోలతోనే అవతలివాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతాడు.. రకరకల డేటింగ్ యాప్ ల ద్వారా పరిచయమైనవాళ్లను.. తన రూమ్ కి వచ్చేలా ఒప్పిస్తాడు.. గది తలుపులు మూసేసి.. డ్రిక్స్ బాటిల్ ఓపెన్ చేస్తాడు.. సీక్రెట్ గా డ్రింక్ లో డ్రగ్స్ కలిపి.. మెల్లగా రొమాన్స్ లోకి దిగుతాడు.. ఎదుటివాళ్లు వద్దనేకొద్దీ ఇంకా వయొలెంట్ గా మారిపోతాడు.. గదిలో జరిగే సీన్లను తన మొబైల్ తో చిత్రీకరించి.. ఆ వీడియోలు, ఫొటోలను అడ్డంపెట్టుకుని బాధితుల్ని బ్లాక్ మెయిల్ చేస్తాడు.. ఇలా వీడి కామదాహానికి 230 మంది అబ్బాయిలు బలయ్యాయి..

రాక్షస రేపిస్టు..
బ్రిటన్ చరిత్రలోనే డేంజరస్ రేపిస్టుగా ముద్రపడిన వీడి పేరు రేన్హార్డ్ సినాగా. వయసు 36. మాంచెస్టర్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. సిటీ శివారులోని గే విలేజ్ లో నివసించేవాడు. సినాగా సొంతదేశం ఇండోనేషియా. వాళ్ల నాన్న బాగా డబ్బున్న మనిషి. ఉన్నత చదువుల కోసం బ్రిటన్ కు వచ్చి పాడుపనులు చేసిన ఈ పాపిష్టికి మాంచెస్టర్ క్రౌన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 130 రేప్ కేసుల్లో దోషిగా నిర్ధారణ అయిన సినాగాను ‘రాక్షస రేపిస్టు'అంటూ తీర్పు సందర్భంగా జడ్జి వ్యాఖ్యానించారు.

బాధితులందరూ అబ్బాయిలే..
గే డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయమైన అబ్బాయిలపై అఘాయిత్యానికి పాల్పడటం రేన్హార్డ్ సినాగా అలవాటని, 2007 నుంచి 2017 దాకా మొత్తం 190 మంది మగవాళ్లపై లైంగికదాడులు చేశాడని బ్రిటీష్ పోలీసులు చెప్పారు. అతని డిజిటల్ డైరీల్లో సుమారు 3.29 టెరాబైట్ల డేటాను సేకరించామని, వాటి నిండా సెక్స్ వీడియోలు, అసభ్యకర ఫొటోలున్నాయని తెలిపారు. ఒక కేసులో అతను 8 గంటల పాటు రేప్ కు పాల్పడినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఆధారాలన్నీ పక్కాగా ఉండటంతో రేన్హార్డ్ సినాగాకు కోర్టు 30 ఏండ్ల జైలు శిక్ష(జీవిత ఖైదు) విధించింది. శిక్ష పడిన తర్వాత కూడా మరో 40మంది అబ్బాయిలు పోలీసులకు ఫోన్ చేసి తామూ సినాగా బాధితులమేనని గోడు వెళ్లబోసుకున్నారు.

తల్లిదండ్రులు కూడా ఛీకొడుతున్నారు
సినాగాకు బ్రిటన్ కోర్టు జీవిత ఖైదు విధించడంపై ఇండోనేషియాలో ఉన్న అతని తల్లిదండ్రులు స్పందించారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపామే తప్ప ఇలాంటి పనులు చేస్తాడని అసలు ఊహించలేదని వారు చెప్పారు. ‘‘వాడు చేసిన నేరాలకు తగిన శిక్ష పడిందని అనుకుంటున్నాం. ఇంతకంటే ఏమీ చెప్పలేను''అని సినాగా తండ్రి సిబున్ మీడియాతో అన్నారు. ఈ రేపిస్టును అసహ్యించుకుంటున్నట్లు చెల్లెలు, తమ్ముడు కూడా చెప్పారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications