వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరల్డ్ టాప్ 'మెట్రో' ఇవే: వాళ్లు మనకన్నా స్పీడ్.., ఇండియా స్థానమెక్కడ?...

హైదరాబాద్ మెట్రో విషయానికొస్తే.. 1లైన్ తో, 64స్టేషన్ల పరిధిలో 72కి.మీ మేర పరుగులు తీయనుంది. రెండు ట్రాక్స్ ఉంటాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ కలల మెట్రో ఎట్టకేలకు పట్టాలపై పరుగులు పెట్టనుంది. మంగళవారం మధ్యాహ్నాం ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మియాపూర్ స్టేషన్ నుంచి మెట్రో రైలు పరుగులు తీయనుంది.

Recommended Video

Hyderabad Metro Rail : Metro smart cards

ఈ సందర్భంగా మియాపూర్-కూకట్ పల్లి వరకు ప్రధాని మోడీ, కేసీఆర్ మెట్రోలో ప్రయాణించనున్నారు. అక్కడినుంచి తిరిగి మళ్లీ మియాపూర్ చేరుకుంటారు. మియాపూర్ లో ఏర్పాటు చేసే మెట్రో షార్ట్ ఫిలిం ప్రదర్శనను ఈ సందర్భంగా మోడీ తిలకిస్తారు.

మెట్రో ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశంలోని ఇతర మెట్రోలతో హైదరాబాద్ మెట్రోను పోలుస్తూ చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రపంచ దేశాల్లోని మెట్రోల గురించి కూడా జనం ఆసక్తిగా ఆరా తీస్తున్నారు.

 ఢిల్లీ టాప్.. చెన్నై లాస్ట్:

ఢిల్లీ టాప్.. చెన్నై లాస్ట్:

దేశంలో ఇప్పటికే ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, గుర్‌గావ్‌, జైపూర్‌, చెన్నై పట్టణాల్లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోను ఈ సేవలు అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఇండియాలో ఉన్న మెట్రోల్లో చెన్నై మెట్రోదే చివరి స్థానం. కేవలం ఒకే ట్రాక్ తో 7స్టేషన్లతో 10కి.మీ మేర మాత్రమే చెన్నైలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో అత్యంత పొడవైన మెట్రో మార్గంగా ఢిల్లీ మెట్రో ఉంది. ఇక్కడ 213కి.మీ మేర మెట్రో సేవలు అందుబాటులో ఉండటం విశేషం.

అండర్ గ్రౌండ్ మెట్రో లండన్:

అండర్ గ్రౌండ్ మెట్రో లండన్:

ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో 157 నగరాల్లో ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌(మెట్రో వ్యవస్థ) సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, చైనా వంటి దేశాలతో పోల్చితే మన దేశంలో మెట్రో సేవలు చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.

ఇక ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్‌గ్రౌండ్‌ మెట్రోగా లండన్ ఆ ఘనత దక్కించుకుంది. 11లైన్లతో, 270స్టేషన్ల పరిధిలో 402కి.మీ మేర లండన్ మెట్రో సేవలందిస్తోంది. సగటున గంటకు 33కిమీ మేర ఈ మెట్రో రైలు ప్రయాణిస్తుంది. సగటున ప్రతీ రోజు 50లక్షల మంది ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకుంటున్నారు.

షాంఘై మెట్రో:

షాంఘై మెట్రో:

అలాగే సుదీర్ఘమైన మెట్రోగా చైనాలోని షాంఘై మెట్రో పేరుగాంచింది. 14లైన్లతో 364స్టేషన్లతో 588కి.మీ మేర షాంఘై మెట్రో పరుగులు తీస్తోంది. ప్రతీరోజు సగటున 90లక్షల నుంచి కోటి జనాభా వరకు ఇక్కడ మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. షాంఘై మెట్రో సగటున గంటకు 35-40కి.మీ మేర ప్రయాణిస్తుంది.

 న్యూయార్క్ మెట్రో:

న్యూయార్క్ మెట్రో:

న్యూయార్క్ సబ్ వేలో 24గం. మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. 36లైన్లతో, 472స్టేషన్ల పరిధిలో 394కి.మీ మేర మెట్రో ఇక్కడ పరుగులు తీస్తోంది. గంటకు సగటున 55కి.మీ వేగంతో ఈ మెట్రో పరుగులు తీస్తుంది. సగటున ప్రతీ రోజు 55లక్షల మంది మెట్రో సేవలను ఉపయోగించుకుంటున్నారు.

 అత్యంత రద్దీ 'బీజింగ్ మెట్రో':

అత్యంత రద్దీ 'బీజింగ్ మెట్రో':

ప్రపంచంలోనే అత్యంత రద్దీ మెట్రోగా బీజింగ్ మెట్రోకు పేరుంది. ఇక్కడ ప్రతీరోజు సగటున 1కోటి 2లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను ఉపయోగించుకుంటున్నారు. 19లైన్లతో, 345స్టేషన్ల పరిధిలో 574కి.మీ మేర ఇక్కడ మెట్రో పరుగులు తీస్తోంది.

హైదరాబాద్ మెట్రో:

హైదరాబాద్ మెట్రో:

దేశంలోనే అతి పెద్దదైన ఢిల్లీ మెట్రో మాత్రమే ప్రపంచ దేశాల మెట్రోకు కాస్త ధీటుగా ఉంది. ఢిల్లీ మెట్రో 16లైన్లతో, 164స్టేషన్ల పరిధిలో, 218కి.మీ మేర పరుగులు తీస్తోంది. ప్రతీ రోజు సగటున 20లక్షల 76వేల మంది ప్రయాణికులు మెట్రో సేవలను ఉపయోగించుకుంటున్నారు.

ఇక హైదరాబాద్ మెట్రో విషయానికొస్తే.. 1లైన్ తో, 64స్టేషన్ల పరిధిలో 72కి.మీ మేర పరుగులు తీయనుంది. రెండు ట్రాక్స్ ఉంటాయి. సగటున గంటకు 35కి.మీ నుంచి గరిష్టంగా 80కి.మీ వరకు ప్రయాణించగలదు. హైదరాబాద్ తో పోల్చితే బెంగుళూరు మెట్రో రైలు పరిధి తక్కువ. బెంగళూరు మెట్రో 2లైన్లతో, 41స్టేషన్ల పరిధిలో కేవలం 42.3కి.మీ మేర పరుగులు తీస్తోంది. ప్రతీ రోజు 3లక్షల 50వేల మంది ప్రయాణికులు దీన్ని ఉపయోగించుకుంటున్నారు.

English summary
It's the list about world top METRO train projects and about Indian metro train projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X