కరోనా విలయం.. అమెరికాలో 95 శాతం ఒమిక్రాన్ కేసులు.. రష్యాలో పెరిగిన మరణాలు
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ముప్పతిప్పలు పెడుతోంది. లక్షలాది మందిని బలితీసుకుంటుంది. వైరస్ దాటికి ప్రజలు గడగడలాడిపోతున్నారు. కరోనా భారిన పడిన రోజుకు లక్ష సంఖ్యలో ఆస్పత్రుల పాలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిన్న ( బుధవారం ) ఒక్కరోజే 25 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు వచ్చాయి. మళ్లీ వైరస్ తీవ్రత పెరగడంతో ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాలో వచ్చిన కొత్త కేసుల్లో 95 శాతం ఒమిక్రాన్ వేరయంట్ వే అని భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికా, ఫ్రాన్స్‌లోనే నమోదువుతున్నాయి.
Recommended Video

అమెరికాలో 95శాతం ఒమిక్రాన్ కేసులు
ప్రపంచ దేశాల్లో కరోనా, ఒమిక్రాన్ విభృంభిస్తోంది. అమెరికాలో రోజుకు లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ( బుధవారం ) ఒక్కరోజే 7,04,661 మంది కొత్తగా వైరస్ భారినపడ్డారు. 1,802 మంది మరణించారు. ప్రస్తుతం లక్షమందికిపైగా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొంతున్నారు. కొత్తగా వచ్చిన కేసుల్లో 95 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌వే అయి ఉంటాయని వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం భావిస్తోంది.
కేసుల తీవ్రత చూస్తుంటే ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. గత వారం రోజుల నుంచి సగటున రోజుకు 4 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. సగటున ప్రతి రోజు 14,800 మందికి పైగా ఆస్పత్రిలో కరోనా రోగులు చేరుతున్నారు. ఇది గత వారంతో పోల్చితే 63 శాతం అధికమని సీడీసీ తెలిపింది.

ఫ్రాన్స్‌లో కరోనా విలయం
అటు ఫ్రాన్స్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. బుధవారం ఒక్కరోజే 3,32,252 కొత్త కేసులు వచ్చాయి. 243 మంది మృతి చెందారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు పెరగడానికి ఇది కూడా కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఇటలీలోనూ రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం 1,89,109 కొత్త కేసులు నమోదయ్యాయి. 183 మంది ప్రాణాలు కోల్పోయారు. 33వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు .

బ్రిటన్‌లో వైరస్ విజృంభణ
బ్రిటన్‌లో కరోనా, ఒమిక్రాన్ గడగడలాడిస్తోంది. బుధవారం ఒక్కరోజే 1,94,747 మంది వైరస్ భారిన పడ్డారు. 343 మంది మరణించారు. 57 వేల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని ఆదేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. లాక్ డౌన్‌కు బదులు ప్రణాళిక బి ని అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మాస్కులు ధరించడం తప్పనిసరి చేయడం, ఉద్యోగులు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోం వంటివి అమలు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు.

స్పెయిన్‌తో కరోనా చెడుగుడు.. రష్యాలో పెరిగిన మరణాలు
స్పెయిన్‌లో మహమ్మారి విజృంభిస్తోంది. నిన్న (బుధవారం) ఒక్కరోజే 1,37,180 మందికి వైరస్ సోకింది. 148మంది మరణించారు. 10,836 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. రష్యాలో 15,772 కొత్త కేసులు రాగా 828 మంది మృతి చెందారు. అమెరికా తర్వాత అత్యధికంగా మృతుల సంఖ్య రష్యాలోనే నమోదయ్యాయి. ఇటలీలో కొత్తగా 1, 89,109 మందికి కరోనా సోకింది. 183 మంది మరణించారు. ఇజ్రాయెల్‌లో బుధవారం రికార్డు స్థాయిలో 11,978 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తి వలనే కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

విమానాలపై హాంకాంగ్ నిషేధం
మరోవైపు కరోనా, ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి పెరగడంలో హాంకాంగ్ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. పలుదేశాలపై విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. భారత్ సహా మొత్తం ఎనిమిది దేశాల నుంచి విమానాలను నిషేధిస్తున్నట్లు హాంకాంగ్ ప్రకటించింది. ఈ ఆంక్షలు జనవరి 21 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. హాంకాంగ్ నిషేధం విధించిన జాబితాలో అమెరికా, బ్రిటన్, ప్రాన్స్ , కెనడా, ఆస్ట్రేలియా, భారత్ , పాకిస్థాన్ దేశాలు ఉన్నాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications