• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబోయ్.. ఇదేం ఇన్ఫెక్షన్?: మహిళ కంట్లోంచి.. 20 రోజుల్లో 14 పురుగులు! చరిత్రలోనే తొలిసారిగా..

By Ramesh Babu
|

న్యూయార్క్: అమెరికాలో ఓ కంటి ఇన్ఫెక్షన్ సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు కేవలం పశువుల కళ్లకు మాత్రమే వచ్చిన ఈ ఇన్ఫెక్షన్ తొలిసారిగా అబ్బీ బెక్లే అనే మహిళకు సోకింది. ఫలితంగా 1.27 సెంటీమీటర్ల పొడవు ఉన్న కొన్ని చిన్న చిన్న పురుగులు ఆమె కంట్లో చేరాయి.

అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సైంటిస్తుల కథనం ప్రకారం.. ఆరెగాన్‌కు చెందిన అబ్బీ బెక్లే(26) కంట్లోంచి 20 రోజుల వ్యవధిలో 14 పురుగులను బయటికి తీశారు. ఇవి థెలాజియా గులోసా జాతికి చెందినవి.

 ఎడమకంట్లో పురుగును గుర్తించింది...

ఎడమకంట్లో పురుగును గుర్తించింది...

అమెరికాలోని ఆరెగాన్‌లో నివసించే అబ్బీ బెక్లే అనే యువతికి తరచూ బయట తిరిగే అలవాటు ఉండేది. ఓ రోజు తన ఎడమ కన్ను దురదగా ఉండడంతో వేళ్లతో నులుముకుంది. తన ఐ లాష్ కారణంగా దురద వస్తుందేమోని తొలుత ఆమె భావించింది. ఓ రోజు ఇలాగే దురదపుడుతుంటే బాగా నలుపుకొని, నీళ్లతో కన్ను కడుక్కుంటుండగా తన కంట్లో ఓ చిన్న పురుగు కదలాడటాన్ని బెక్లే గుర్తించింది. భయంతో వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వెళితే అక్కడ ఆమె కంట్లోంచి ఓ రెండు పురుగులను వారు బయటికి తీశారు. ఆ తరువాత కూడా పురుగులు కదలాడుతుండడంతో ఆమె కంటి వైద్యుడిని కలిసింది. ఆయన పరిశీలించి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అలాంటి పురుగులు సాధారణంగా కుక్కలు, పిల్లులు, ఇతర మృగాల కళ్లల్లో కనిపిస్తుంటాయి. ఆయన కూడా ఆమె కంట్లోంచి మరో రెండు పురుగులను బయటికి తీశారు.

 20 రోజుల్లో 14 పురుగులు...

20 రోజుల్లో 14 పురుగులు...

ఓ వారం రోజులపాటు కంటి ఇన్ఫెక్షన్‌తో సతమతమైన బెక్లీ చివరికి విషయాన్ని తన బాయ్‌ఫ్రెండ్‌కు తెలియజేసింది. అతడి అమ్మానాన్నలిద్దరూ వైద్యులే. ఆరెగాన్‌లోని పోర్ట్‌లాండ్‌లో ఉన్న వారి దగ్గరకు వెళ్లి చూపించుకుంది. ఆ పురుగులు ఎక్కడ పిల్లల్ని పెడతాయో, అవి తన కంట్లోంచి ఎక్కడ మెదడులోకి ప్రవేశిస్తాయో, దానివల్ల ఎక్కడ పక్షవాతం వస్తుందో అని బెక్లీ భయం. అయితే ఆ భయమేమీ పెట్టుకోవద్దని, అవేమీ కంట్లోనే పిల్లల్ని పెట్టవని వారు ఆమెకు భరోసా ఇచ్చారు. చివరికి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సైంటిస్తులు ఒక ప్రత్యేకమైన లాబొరేటరీలో ఆమె కంట్లోంచి మొత్తం 14 పురుగులు బయటికి తీశారు.

 మనుషుల్లో ఏన్నడూ కానరాని ఇన్ఫెక్షన్...

మనుషుల్లో ఏన్నడూ కానరాని ఇన్ఫెక్షన్...

సాధారణంగా ఈ థెలాజియా గులోసా జాతికి చెందిన పురుగులు అమెరికాలోని ఉత్తర రాష్ట్రాలు, దక్షిణ కెనడాల్లో ఉండే పశువుల కళ్లల్లో మాత్రమే కనిపిస్తాయి. అసలు మనుషుల్లో ఇలాంటి ఇన్ఫెక్షన్లు అమెరికాలో చాలా తక్కువ. ఇవి ఎక్కువ కాలం కంట్లో ఉంటే.. ఏకంగా చూపే పోయే ప్రమాదం ఉంటుంది. బెక్లీ విషయానికొస్తే.. ఆమె తన స్వస్థలమైన దక్షిణ ఆరెగాన్‌లోని క్యాటిల్ ఫీల్డ్స్‌కు తరచూ వెళుతుండేది. అక్కడ ఉండే ఆవులు, గుర్రాలు వద్దకు వెళుతూ వాటికి మేత వేయడం వంటి పనులు చేస్తుండేది. ఆ సమయంలో ఆ పశువుల కళ్లపై వాలిన ఈగలేమైనా తరువాత బెక్లీ కళ్లపై వాలి ఉంటాయని, అలా ఈ పురుగు లార్వా బెక్లీ కంట్లోకి వ్రవేశించి ఉంటుందని డాక్టర్లు అంటున్నారు.

 చరిత్రలోనే తొలిసారిగా బెక్లీ కంట్లో....

చరిత్రలోనే తొలిసారిగా బెక్లీ కంట్లో....

అబ్బీ బెక్లీ కంట్లో థెలాజియా గులోసా జాతి పురుగులు చేరడం చరిత్రలో ఇదే తొలిసారి అని రిచర్డ్ బ్రాడ్‌బరీ అనే మెడికల్ పారాసైటాలజిస్ట్ వ్యాఖ్యానించారు. గతంలో కేవలం రెండు కంటి పురుగు జాతులు మాత్రమే కంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యాయని, ఈ జాతి పురుగు మూడోదని బ్రాడ్‌బరీ అన్నారు. సాధారణంగా పశువులు, జంతువుల కళ్లపై వాలే ఈగలు ఈ పురుగుల లార్వాలను ఒకచోట నుంచి మరోచోటికి వ్యాప్తి చేస్తుంటాయని ఆయన తెలిపారు. ఆసియా ఖండంలోని పలు దేశాల్లో, అలాగే రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో నివసించే మనుషుల్లో కొందరికి ఈ రకమైన కంటి ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయని రిచర్డ్ బ్రాడ్‌బరీ పేర్కొన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An Oregon woman who had worms coming out of her eye is being called the first known human case of a parasitic infection spread by flies. Fourteen tiny worms were removed from the left eye of the 26-year-old woman over a 20-day period in August 2016 before her symptoms dissipated. The worms were translucent and each less than half an inch long. Scientists reported the case Monday. The woman was diagnosed in August 2016 with Thelazia gulosa, a type of eye worm seen in the northern United States and southern Canada – but only in cattle. It is spread by flies that feed on eyeball lubrication. The woman had been horseback riding in Gold Beach, Oregon, in a cattle farming area. After a week of eye irritation, she pulled a worm from her eye.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more