తొలిసారి: గే పార్ట్‌నర్‌ను పెళ్లి చేసుకోనున్న లక్సెంబర్గ్ ప్రధాని
లక్సెంబర్గ్: పశ్చిమ యూరోప్ దేశం లక్సెంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెటెల్ తన సహచరుడు గోథియర్‌ను వివాహం చేసుకోనున్నాడు. వచ్చే నెలలో అతడిని ప్రధాని పెళ్లి చేసుకోనున్నట్లు మంగళవారం రాత్రి అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
స్వలింగ సంపర్కుడు అయిన జేవియర్ బెటెల్ 2013 డిసెంబర్ నెలలో లక్సెంబర్గ్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అంతకు మూడేళ్ల ముందు నుండే ఆయన గోథియర్‌తో సహజీవనం చేస్తున్నాడు.

ప్రధానమంత్రి హోదాలో ఓ గే పెళ్లి చేసుకోనుండటం ఇదే ప్రథమం. దీంతో సర్వత్రా ఆసక్కి నెలకొంది. వివాహం తన వ్యక్తిగత విషయమని, ప్రచారం అవసరం లేదని ప్రధాని జేవియర్ బెటెల్ చెబుతున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత మేగజైన్లు కొన్ని పెళ్లి వేడుకను ప్రచురించేందుకు సిద్ధం కాగా అతను పైవిధంగా స్పందించాడు.
లక్సెంబర్గులోని రోమన్ కేథలిక్ డచీ చర్చిలో వీరి పెళ్లి జరగనుంది. ఎన్నికల్లో భారీ మెజార్టీతో అతను గెలిచాడు. అతను లక్సెంబర్గులో లెస్బియన్, గే, బైసెక్సువల్స్, ట్రాన్స్ జెండర్స్ (ఎల్జీబీటీ) హక్కుల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రెండు నెలల క్రితం గే పెళ్లిళ్లను చట్టబద్ధం చేశారు.












Click it and Unblock the Notifications