ఇజ్రాయెల్ కు బిగ్ షాక్: ఇరాన్ చేతులు కలిపిన ఆ దేశం- ముప్పేట దాడి
గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వచ్చిన ఇజ్రాయెల్ మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుంది. టెహ్రాన్ సహా ఆ దేశ ప్రధాన నగరాలపై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులను సాగిస్తోంది. మిస్సైళ్లతో విధ్వంసాన్ని సృష్టిస్తోంది.
తాజాగా- ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంపై మిస్సైళ్లను సంధించింది ఇజ్రాయెల్. ఆయిల్ డిపోలపైనా బాంబుల వర్షాన్ని కురిపించింది. టెహ్రాన్‌లో అణ్వాయుధ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది.

ఈ దాడుల్లో ఆర్గనైజేషన్ ఆఫ్ డిఫెన్సివ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ (SPND) భవన సముదాయం సైతం ధ్వంసమైంది. ఇరాన్ అణ్వాయుధ కార్యకలాపాలకు ఇది ప్రధాన కేంద్రం. దీన్ని అమద్ ప్రాజెక్ట్ గా పిలుస్తారు. తాజా దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ, SPND న్యూక్లియర్ ప్రాజెక్టు ప్రధాన కార్యాలయాలు దెబ్బతిన్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
ఇప్పటికే ఇరాన్ న్యూక్లియర్ సిటీ నటాంజ్ విధ్వంసానికి గురైంది. నటాంజ్ సిటీలోని అణు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగించింది ఇజ్రాయెల్. అలాగే ఫోర్డో, టెహ్రాన్ చుట్టూ ఉన్న ఇతర వ్యూహాత్మక ప్రదేశాలనూ తుత్తునీయలు చేసింది. ఈ ఆపరేషన్‌లో 200కు పైగా వార్ ఎయిర్ క్రాఫ్ట్ లను వినియోగించింది.
ఈ పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ కు బిగ్ షాక్ తగిలింది. దూకుడుకు బ్రేక్ పడింది. ఇజ్రాయెల్ పై యెమెన్ దాడికి దిగింది. ఇరాన్ సహకారంతో ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది. యెమెన్ హౌతీలు ఇరాన్ తో చేతులు కలిపారు. ఇజ్రాయెల్ లోని పలు ప్రాంతాలపై బాలిస్టిక్ క్షిపణులను సంధించారు.
ఈ విషయాన్ని హౌతీ ఆర్మీ అధికార ప్రతినిధి యాహ్యా సర్రెయ్యా తెలిపారు. ఈ మేరకు దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు. 24 గంటల్లో వ్యవధిలో సెంట్రల్ ఇజ్రాయెల్ లోని జాఫ్ఫాపై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు సాగించినట్లు వెల్లడించారు. పాలస్తీనియన్ల అణచివేత, ఇరాన్ పై దాడులకు ప్రతీకారంగా ఈ యుద్ధాన్ని ప్రకటించినట్లు తెలిపారు.
యెమెన్ హౌతీల దాడులను ఇజ్రాయెల్ ధృవీకరించింది. యెమెన్ వైపు నుండి దూసుకొచ్చిన ఓ బాలిస్టిక్ మిస్సైల్ తమ దేశ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకుని వెస్ట్ బ్యాంక్ లోని హెబ్రాన్ లో పడినట్లు తెలిపింది. తామే ఈ క్షిపణిని సంధించినట్లు ఇప్పటివరకు హౌతీ ప్రకటించలేదు. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా కూడా హౌతీలపై దాడులను చేపట్టిన విషయం తెలిసిందే.
-
కుప్పకూలిన ఖతర్ హెలికాప్టర్.. !! -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
యుద్ధ భారం వాహనదారులు మోయక తప్పదా? -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
ఇరాన్ ఆర్మీ జనరల్ మృతి- కూలిన మరో మూలస్తంభం -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ??












Click it and Unblock the Notifications